 
                                                        టాలీవుడ్ క్వీన్ కాజల్ అగర్వాల్ తల్లి అయింది. పెళ్లి కాకుండానే తల్లి అయిందా? అని ఆశ్చర్యపోకండి. కాజల్ తల్లి అయింది సినిమాలో. ఆమె ప్రస్తుతం తేజ దర్శకత్వంలో నటిస్తోంది. రానా హీరోగా నటిస్తున్న “నేనే రాజు నేనే మంత్రి” చిత్రం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో రానాకి భార్య రాధా పాత్రను కాజల్ పోషిస్తోంది. కర్నూలు జిల్లా బనగానపల్లిలోని ఆసుపత్రిలో మంగళ వారం, బుధవారం రానా, కాజల్ పై కొన్ని సీన్స్ చిత్రీకరించారు. ఆ ఫోటోలు తాజాగా బయటికి వచ్చాయి. ఇందులో కాజల్ గర్భవతిగా కనిపిస్తోంది. ఆమెకు వైద్యుడైన రానా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేసిన సన్నివేశాన్ని చిత్రీకరించినట్లు సమాచారం.
తొలిసారిగా తల్లి పాత్రలో కాజల్ కనిపిస్తుండడంతో ఈ మూవీపై ఆసక్తి పెరిగింది. సురేష్ ప్రొడక్షన్స్, బ్లూ ప్లానెట్ ఎంటర్‌టైనమెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అశితోష్ రాణా, కేథరిన్ థెరిస్సా, నవదీప్, పోసాని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ కోసం అనూప్ రూబెన్స్ సమకూర్చిన పాటలు త్వరలో రిలీజ్ కానున్నాయి. వచ్చే నెల మూవీ థియేటర్లోకి రానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
