‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD), సినిమా విడుదలకు గట్టిగా వారం కూడా లేదు. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ చేయలేదు. టికెట్ రేటు ఎంత ఉంటుంది, సింగిల్ థియేటర్‌లో ఎంత, మల్టీప్లెక్స్‌లో ఎంత అనే లెక్క ఇంకా తేలడం లేదు. అయితే వీటన్నింటి కంటే సినిమా అర్ధ రాత్రి షోలు ఉంటాయా లేదా అనే ప్రశ్న ఇంకా ఎక్కువ గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో టాలీవుడ్ ఫ్రెండ్లీ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి.
ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఉన్న ప్రభుత్వంలో ప్రత్యేక షోలు, ప్రత్యేక ధరలు పెద్దగా ఉండేవి కావు. అవి లేకపోగా లేని పోని ఇబ్బందులు కూడా పెట్టేవారు. అయితే ఇప్పుడు ఏపీలో సినిమా ఫ్రెండ్లీ కూటమి ప్రభుత్వం వచ్చింది. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా సినిమా పరిశ్రమకు బాగా దగ్గరి వ్యక్తే. ఈ లెక్కన ఏపీలో ప్రత్యేక షోల పర్మిషన్ ఈజీగానే వస్తుంది అని చెబుతున్నారు. ఇక తెలంగాణలో ఇప్పటికే ధరలకు సంబంధించిన జీవో ఉంది.
అయితే, ‘కల్కి 2898 ఏడీ’ సినిమా టీమ్ నుండి ఎలాంటి సమాచారం లేదు. ప్రత్యేక షో ఉంటుందా? లేదా? అనే సమాచారం రావడం లేదు. అయితే మనకు అర్ధరాత్రి అంటే యూకే, యూఎస్‌లో ప్రీమియర్లు పడే సమయం. అక్కడ ప్రీమియర్లు పడితే మనం ఉదయం నిద్ర లేచేసరికి స్పాయిలర్లు, రివ్యూలు వచ్చేస్తాయి. దీంతో పారలల్‌గా ఇక్కడ కూడా షోలు పడితే ఇబ్బంది ఉండదు అని అంటున్నారు.
అయితే, టీమ్ నుండి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇంకా వారం కూడా లేని ఈ సమయంలో ఆ క్లారిటీ ఇచ్చేస్తే జనాలు బుకింగ్‌లు చేసుకుంటారు. అయితే ధరల విషయంలో ఇంకా ఓ నిర్ణయం రాకపోవడం వల్లే షోల సంగతి తేలడం లేదు అని అంటున్నారు. ఈ రోజు సాయంత్రానికల్లా సమాచారం వచ్చేస్తుంది అని టాక్. చూద్దాం ‘కల్కి’ అర్ధ రాత్రి షోలు ఉంటాయో లేదో?