నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన “కంగువ”కు మొదటి షో నుంచే నెగిటివ్ రెస్పాన్స్ రాగా, సాయంత్రానికి ఫ్లాప్ సినిమాగా డిక్లేర్ చేసేశారు. హీరో సూర్య ( Suriya) ,దర్శకుడు శివ (Siva) , నిర్మాత జ్ఞానవేల్ రాజా (K. E. Gnanavel Raja) “కంగువ” (Kanguva) రెండు వేల కోట్ల రూపాయల వసూళ్లు కొల్లగొట్టడం ఖాయం అంటూ చేసిన హడావుడి అందరికీ గుర్తుండే ఉంటుంది. విడుదలైన 16 రోజులకు తిప్పి కొడితే 100 కోట్ల రూపాయల గ్రాస్ కూడా చేయలేకపోయింది ఈ చిత్రం. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న విషయం తెలిసిందే.
Kanguva
నిజానికి ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డిసెంబర్ 13న ఉండగా.. డిసెంబర్ 1న 4K ప్రింట్ ఆన్లైన్లో లీకైపోయింది. అప్పట్నుంచి సినిమాలో సీన్స్ కి ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ సినిమాని పట్టుకున్నా జ్యోతిక (Jyothika) తొక్కేస్తున్నారు అని బిల్డప్ ఇచ్చింది అంటూ ఆమెను, సినిమాలోని కొన్ని సీన్స్ కి శివ ఈస్థాయి చిల్లర కంటెంట్ తీస్తాడని అస్సలు ఊహించలేదని ఇంకొందరు కామెంట్ చేయడం మొదలుపెట్టారు.
అసలు సినిమా ఒరిజినల్ ప్రింట్ ఎక్కడనుంచి లీక్ అయ్యింది అనే విషయం అర్థం కాక ఓ పక్క చిత్రబృందం తలలు పట్టుకుంటుండగా, ఈ ట్రోల్ భరించలేక శివ & టీమ్ సైలెంట్ అయిపోయారు. అయితే.. అసలు ఇలాంటి కంటెంట్ తో శివ & జ్ఞానవేల్ రాజా 2000 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తామని మేకపోతు గాంభీర్యం ఎలా ప్రదర్శించారో అర్థం కాలేదు.
సినిమా ప్రమోట్ చేయడం ఎంత ముఖ్యమో, ఇలా ట్రోల్స్ కి దొరక్కుండా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్ అనే విషయం ఇప్పుడైనా దర్శకనిర్మాతలకు అర్థమై ఉంటుంది. ఇకపోతే.. అమెజాన్ ప్రైమ్ టీమ్ వాళ్లు కూడా ఈ లీక్ విషయంలో చాలా సీరియస్ అయ్యారట. కానీ ఇప్పుడు ఏమీ చేయలేక మిన్నకుండిపోయారు. ఏదేమైనా “కంగువ” ఈ ఏడాది బిగ్గెస్ట్ ట్రోల్ మెటీరియల్ అయిపోయింది.