స్టార్ హీరో సూర్య (Suriya) నటించిన కంగువ (Kanguva) మూవీ మొదట అనుకున్న ప్రకారం దసరా కానుకగా రిలీజ్ కావాల్సి ఉన్నా వేట్టయన్ (Vettaiyan) మూవీతో పోటీ ఎందుకని భావించి ఈ సినిమాను వాయిదా వేశారు. బాలల దినోత్సవం కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. అయితే దసరా కానుకగా ఈ సినిమా విడుదలై ఉంటే మాత్రం కలెక్షన్ల విషయంలో అదరగొట్టేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలల దినోత్సవం కానుకగా రిలీజ్ కావడం ఈ సినిమాకు ఎంతమేర ప్లస్ అవుతుందో చూడాలి.
Kanguva
అందువల్ల కంగువ మంచి ఛాన్స్ మిస్సైందని ఇప్పుడు విడుదలై ఉంటే సరికొత్త రికార్డ్స్ సాధించేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఇంత మంచి ఛాన్స్ అయితే కంగువకు దొరకదని చెప్పవచ్చు. నవంబర్ నెల పెద్ద సినిమాలకు పెద్దగా అనుకూలం అయితే కాదు. అందువల్ల కంగువ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో ఏ రేంజ్ లో అదరగొడుతుందనే ప్రశ్న సైతం సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతోంది.
కంగువ సినిమా బడ్జెట్ ఏకంగా 500 కోట్ల రూపాయలు అని వార్తలు వినిపిస్తుండగా ఈ సినిమాకు బిజినెస్ సైతం అదే స్థాయిలో జరిగిందని తెలుస్తోంది. కంగువ తెలుగు రాష్ట్రాల హక్కులు సైతం భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని భోగట్టా. కంగువ సినిమా కోసం సూర్య పడిన కష్టం అంతాఇంతా కాదు. ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. సూర్య డ్యూయల్ రోల్ మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
సూర్య ఈ సినిమాకు సంబంధించి లుక్స్ విషయంలో సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. తర్వాత సినిమాలతో సూర్య భారీ విజయాలను అందుకుంటారో లేదో చూడాలి. సూర్య రెమ్యునరేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారని పరిమితంగానే పారితోషికం డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే సోలో రిలీజ్ డేట్ వల్ల కంగువ మూవీ రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజయ్యే అవకాశం ఉంది.