‘కపటదారి’ ఫస్ట్ డె కలెక్షన్స్..?
- February 20, 2021 / 05:48 PM ISTByFilmy Focus
‘క్రియేటివ్ ఎంటర్టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్’ బ్యానర్ పై జి.ధనంజయన్, లలిత ధనంజయన్ ల నిర్మాణంలో ప్రదీప్ కృష్ణమూర్తి డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘కపటదారి’. సుమంత్,నందిత శ్వేతా జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 19న(నిన్న) విడుదల అయ్యింది. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ లు ఆకట్టుకునే విధంగానే ఉండడంతో ఈ సినిమా పై అందరి ఫోకస్ పడింది. కన్నడంలో సూపర్ హిట్ అయిన ‘కవలుదారి’ కి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. అయినా మొదటి రోజు ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది.

ఇక మొదటి రోజు కలెక్షన్లను గమనిస్తే :
| నైజాం | 0.04 cr |
| సీడెడ్ | 0.02 cr |
| ఉత్తరాంధ్ర | 0.02 cr |
| ఈస్ట్ | 0.02 cr |
| వెస్ట్ | 0.01 cr |
| గుంటూరు | 0.01 cr |
| కృష్ణా | 0.01 cr |
| నెల్లూరు | 0.01 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 0.14 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.01 cr |
| ఓవర్సీస్ | 0.01 cr |
| వరల్డ్ వైడ్ (టోటల్) | 0.16 cr |
‘కపటదారి’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.1.9కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. చాలా వరకూ ఈ చిత్రాన్ని నిర్మాతలు ఒన్ రిలీజ్ చేసుకోబోతున్నారు. అయినప్పటికీ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యి క్లీన్ హిట్ గా నిలవాలి అంటే.. రూ.2.2కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు కేవలం 0.16 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 2.04 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఇంత ఘోరమైన ఓపెనింగ్స్ చూస్తుంటే అసాధ్యమని అనిపించక మానదు.
Click Here To Read Movie Review
Most Recommended Video
పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!












