Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Featured Stories » రజనీకాంత్ సార్ అప్పుడే సినిమా చేయమని అడిగారు : యంగ్ & టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్

రజనీకాంత్ సార్ అప్పుడే సినిమా చేయమని అడిగారు : యంగ్ & టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్

  • April 9, 2018 / 06:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రజనీకాంత్ సార్ అప్పుడే సినిమా చేయమని అడిగారు : యంగ్ & టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్

చూడ్డానికి ‘ఈ కుర్రాడు డైరెక్టరా?’ అనేలా ఉంటాడు కానీ.. ఒక దర్శకుడిగా కార్తీక్ చేసినన్ని ప్రయోగాలు, అతడి సినిమాల్లో ఉండే క్యారెక్టర్లలో డెప్త్ ప్రెజంట్ జనరేషన్ డైరెక్టర్స్ ఎవరి సినిమాల్లోనూ ఉండవు. షార్ట్ ఫిలిమ్ డైరెక్టర్ గా కెరీర్ మొదలెట్టిన కార్తీక్ “పిజ్జా” సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ సినిమాతో తెలుగు-తమిళ భాషల్లో విశేషమైన క్రేజ్ సంపాదించుకొన్న కార్తీక్ అనంతరం తెరకెక్కించిన “జిగర్తాండ” (తెలుగులో “చిక్కడు దొరకడు”) కమర్షియల్ హిట్ అవ్వడమే కాక ప్రతినాయక పాత్ర పోషించిన బాబీ సింహాకు నేషనల్ అవార్డ్ సైతం తెచ్చిపెట్టింది. అనంతరం కార్తీక్ రూపొందించిన “ఇరైవి” కమర్షియల్ గా ఫెయిల్ అయ్యింది కానీ.. ఒక దర్శకుడిగా అతడి స్థాయిని శిఖరానికి చేర్చింది. స్త్రీ కోణంలో కథను నడిపిన విధానానికి యావత్ తమిళ పరిశ్రమ కార్తీక్ ను ప్రశంసలతో ముంచెత్తింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయడానికంటే ప్రయోగాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపే కార్తీక్ తెరకెక్కించిన తాజా చిత్రం “మెర్క్యూరీ”. ప్రభుదేవ తొలిసారిగా ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ ప్రయోగాత్మక చిత్రం మూకీ సినిమాగా తెరకెక్కడం విశేషం. అందుకే ఈ చిత్రాన్ని భాషా బేధం లేకుండా అన్నీ ఇండియన్ లాంగ్వేజస్ లో రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 13న ఈ చిత్రం తమిళనాడులో తప్ప ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా తెలుగు మీడియాతో ముచ్చటించాడు టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్. ఆ విశేషాలు మీకోసం..!!

అది చిన్న కన్ఫ్యూజన్ వల్ల రైజ్ అయిన ఇష్యూ.. Karthika Subbaraju“మెర్క్యూరీ” మూకీ సినిమా కావడంతో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ మరియు ఇతర ప్రాంతీయ భాషల్లోనూ ఒకేసారి విడుదల చేద్దామనుకొన్నాం. ప్లానింగ్ అంతా పూర్తయ్యాక తమిళనాట థియేటర్ స్ట్రైక్ అయ్యింది. తమిళ ఫిలిమ్ ఛాంబర్ తీసుకొన్న నిర్ణయంపై గౌరవంతో ఒక్క తమిళంలో తప్ప మిగతా భాషల్లో “మెర్క్యూరీ”ని రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాం. అయితే.. కొందరు దర్శకనిర్మాతలకు మా ఇంటెన్షన్ అర్ధం కాక మొదట్లో అడ్డు చెప్పారు. అయితే.. ఇప్పుడు అంతా క్లియర్.

అదొక్కటే భయం..Karthika Subbaraju తమిళంలో తప్ప “మెర్క్యూరీ” చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయితే చేసేస్తున్నాం కానీ.. తమిళనాట థియేటర్స్ స్ట్రైక్ ఎప్పుడు క్లియర్ అవుతుందో తెలియదు. అలాగే.. మూకీ సినిమా కాబట్టి పైరసీ కారణంగా ఎక్కడ తమిళనాడులో రిలీజ్ అయ్యే టైమ్ కి ప్రేక్షకులు ఆల్రెడీ ఇంటర్నెట్ లో సినిమా చూసేస్తారేమో అనే భయం ఉంది. కానీ.. పైరసీని అరికట్టడానికి ప్రయత్నిస్తాం.

ఆ హాలీవుడ్ సినిమా ఎఫెక్ట్ ఉండదు.. Karthika Subbaraju“మెర్క్యూరీ” ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఆల్మోస్ట్ అందరూ “ఎ క్వైట్ ప్లేస్” అనే హాలీవుడ్ సినిమాతో కంపేర్ చేశారు. కాన్సెప్ట్ కాస్త కంపేరిటివ్ గా ఉన్నా.. ఆ సినిమాకి, నా సినిమాకి అస్సలు సంబంధం లేదు. “మెర్క్యూరీ”లో మీరెవరూ ఎక్స్ పెక్ట్ చేయని ఎలిమెంట్స్ చాలా ఉంటాయి.

సౌండ్ డిజైన్ సినిమాకి హైలైట్.. Karthika Subbarajuమూకీ సినిమా కావడంతో కొంత పార్ట్ షూటింగ్ అయ్యాక మా మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ గారికి చూపించాను. ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు. బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకొన్నారు. అలాగే సౌండ్ డిజైన్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

కథ నన్ను ఎగ్జైట్ చేయాలి.. Karthika Subbarajuవరుసబెట్టి సినిమాలు చేయడం నాకు నచ్చదు. అలాగే.. రెగ్యులర్ & రొటీన్ సినిమాలు కూడా చేయలేను. ఒక కథ రాసుకొన్నానంటే అది నన్ను ఎగ్జైట్ చేయాలి. అప్పుడే సెట్స్ మీదకు వెళ్లగలను. “ఇరైవి” తర్వాత నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి. అయితే.. నేను రాసుకున్న “మెర్క్యూరీ” కథ నన్ను బాగా ఎగ్జైట్ చేసింది. అందుకే ఈ ప్రొజెక్ట్ ను సెట్స్ మీదకు తీసుకొచ్చాను.

ప్రభుదేవను దృష్టిలో పెట్టుకొని రాసుకోలేదు.. Karthika Subbarajuనేను ఈ సినిమా కథ రాసుకొంటున్నప్పుడు ప్రతినాయకుడి పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండాలి అని మాత్రమే అనుకున్నాను. ఆ తర్వాత ప్రభుదేవ గారైతే ఈ పాత్రకు బాగుంటారనిపించింది. ఆయన్ని కలిస్తే “అసలు మూకీ సినిమా జనాలు చూస్తారంటావా” అని మాత్రమే అడిగారు. అయితే.. క్యారెక్టర్ బాగా నచ్చడంతో పెర్ఫార్మెన్స్ విషయంలో ఆయనే చాలా ఇన్పుట్స్ ఇచ్చేవారు. ఆ పాత్ర అంత రియలిస్టిక్ గా రావడానికి ప్రభుదేవగారే కారణం.

చేప్తే చేసేవాడ్నేమో అన్నారు రజనీకాంత్.. Karthika Subbaraju“జిగర్తాండ” సినిమా చూసిన రజనీకాంత్ గారు నన్ను ఇంటికిపిలిచి మరీ అభినందించారు. అప్పుడు నేను ఆయనకి “బాబీ సింహా క్యారెక్టర్ నేను మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొనే రాసుకొన్నాను. అసలు ఆ పాత్ర మీరు చేస్తే ఇంకా బాగుండేది” అన్నాను. అప్పుడాయన “అడగాల్సింది కదా.. చేసేవాడ్నేమో, ఇంకోసారి ఏదైనా స్క్రిప్ట్ రాసుకుంటే నాకు చెప్పు.. తప్పకుండా సినిమా చేద్దాం” అన్నారు. అలా ఇప్పుడు ఆయనతో సినిమా తీసే అవకాశం అందుకొన్నాను.

నన్ను నేను ఎక్స్ ఫ్లోర్ చేసుకోవాలనుకొంటున్నాను.. Karthika Subbarajuప్రయోగాత్మక సినిమాలు మాత్రమే చేయాలని నేనేమీ నిశ్చయించుకొని కూర్చోలేదు. అయితే.. ఒక దర్శకుడిగా నాకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకోవాలని మాత్రం ప్రతిక్షణం పరితపిస్తాను. నన్ను నేను ప్రేక్షకులకు కొత్తగా చూపించుకోవాలి అంటే నా సినిమా వాళ్ళకి ఒక సరికొత్త అనుభూతినివ్వాలి. అందుకే వైవిధ్యమైన కథ-కథనాలకు ఇంపార్టెన్స్ ఇస్తాను.

ఫ్లాపైనా కూడా గర్వకారణం.. Karthika Subbarajuనా మునుపటి చిత్రం “ఇరైవి” కమర్షియల్ గా సరిగా ఆడలేదు. అయితే.. నా కెరీర్ బెస్ట్ ఫిలిమ్ మాత్రం అదేనని గర్వంగా చెప్పగలను. ఎందుకంటే.. నాకు ఒక దర్శకుడిగా పేరుతోపాటు గౌరవం కూడా తీసుకొచ్చిన సినిమా అది. ఆ సినిమా రిలీజయ్యాక వచ్చిన స్పందన, అభినందనలు సినిమా కమర్షియల్ గా హిట్ అవ్వలేదు అనే బాధను దూరం చేశాయి. మళ్ళీ తప్పకుండా ఆ తరహా సినిమా ఒకటి తప్పకుండా చేస్తాను.

రజనీకాంత్ సినిమా కథ ఇంకా పూర్తవ్వలేదు.. Karthika Subbarajuరజనీకాంత్ గారికి బేసిక్ స్టోరీ లైన్ చెప్పాను. ఆయన నచ్చి ఒకే చేసి, ఎనౌన్స్ మెంట్ కూడా చేయించారు. ఒక మంచి యాక్షన్ డ్రామాగా ఆయన సినిమా ఉంటుంది. అయితే.. కథ ఇంకా పూర్తవ్వలేదు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యాక ఇంకో రెండు లేదా మూడు నెలల్లో షూటింగ్ మొదలెట్టాలన్న ఆలోచనలో ఉన్నాను. రజనీకాంత్ గారితో సినిమా అనంతరం ధనుష్ తో సినిమా ఉంటుంది.

– Dheeraj Babu

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Karthik Subbaraj
  • #Karthik Subbaraj
  • #Karthik Subbaraj Interview
  • #Karthik Subbaraj Movies
  • #Karthik Subbaraj New Movie

Also Read

Thanu Radhe Nenu Madhu: ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వంలో రూపొందిన లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘తను రాధే నేను మధు’

Thanu Radhe Nenu Madhu: ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వంలో రూపొందిన లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘తను రాధే నేను మధు’

‘నేను రోడ్డు మీదకు వచ్చేస్తా.. కాబట్టి ఒక రూమ్ ఉంచు’

‘నేను రోడ్డు మీదకు వచ్చేస్తా.. కాబట్టి ఒక రూమ్ ఉంచు’

నెట్ ఫ్లిక్స్ నుండి అజిత్ సినిమా డిలీట్.. కారణం అతనే?

నెట్ ఫ్లిక్స్ నుండి అజిత్ సినిమా డిలీట్.. కారణం అతనే?

Mahesh Babu: నువ్వు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయొద్దు.. యంగ్‌ టెక్నీషియన్‌ కోసం మహేష్‌ పోస్ట్‌

Mahesh Babu: నువ్వు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయొద్దు.. యంగ్‌ టెక్నీషియన్‌ కోసం మహేష్‌ పోస్ట్‌

Sharwanand: విడాకుల బాటలో శర్వానంద్ కపుల్?

Sharwanand: విడాకుల బాటలో శర్వానంద్ కపుల్?

NTR: కండలు తిరిగిన దేహంతో ఎన్టీఆర్… జిమ్లో కసరత్తులు.. ఆ సినిమా కోసమేనా?

NTR: కండలు తిరిగిన దేహంతో ఎన్టీఆర్… జిమ్లో కసరత్తులు.. ఆ సినిమా కోసమేనా?

related news

రజనీ కథతో 500వ సినిమా.. కట్ చేస్తే ‘పెదరాయుడు’ మ్యాజిక్ రిపీట్ కాలేదు

రజనీ కథతో 500వ సినిమా.. కట్ చేస్తే ‘పెదరాయుడు’ మ్యాజిక్ రిపీట్ కాలేదు

Rajinikanth: ఇళయరాజా.. ఓ అర బీరు.. ఆసక్తికర విషయాలు చెప్పిన రజనీకాంత్‌

Rajinikanth: ఇళయరాజా.. ఓ అర బీరు.. ఆసక్తికర విషయాలు చెప్పిన రజనీకాంత్‌

Kamal – Rajini: ఫైనల్‌గా క్లారిటీ ఇచ్చేసిన కమల్‌ హాసన్‌.. తలైవాతో..

Kamal – Rajini: ఫైనల్‌గా క్లారిటీ ఇచ్చేసిన కమల్‌ హాసన్‌.. తలైవాతో..

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి ఇంచ్ దూరంలో

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి ఇంచ్ దూరంలో

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి చేరువలో..!

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి చేరువలో..!

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్.. క్యాష్ చేసుకుంటుందా?

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్.. క్యాష్ చేసుకుంటుందా?

trending news

Thanu Radhe Nenu Madhu: ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వంలో రూపొందిన లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘తను రాధే నేను మధు’

Thanu Radhe Nenu Madhu: ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వంలో రూపొందిన లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘తను రాధే నేను మధు’

3 hours ago
‘నేను రోడ్డు మీదకు వచ్చేస్తా.. కాబట్టి ఒక రూమ్ ఉంచు’

‘నేను రోడ్డు మీదకు వచ్చేస్తా.. కాబట్టి ఒక రూమ్ ఉంచు’

3 hours ago
నెట్ ఫ్లిక్స్ నుండి అజిత్ సినిమా డిలీట్.. కారణం అతనే?

నెట్ ఫ్లిక్స్ నుండి అజిత్ సినిమా డిలీట్.. కారణం అతనే?

4 hours ago
Mahesh Babu: నువ్వు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయొద్దు.. యంగ్‌ టెక్నీషియన్‌ కోసం మహేష్‌ పోస్ట్‌

Mahesh Babu: నువ్వు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయొద్దు.. యంగ్‌ టెక్నీషియన్‌ కోసం మహేష్‌ పోస్ట్‌

4 hours ago
Sharwanand: విడాకుల బాటలో శర్వానంద్ కపుల్?

Sharwanand: విడాకుల బాటలో శర్వానంద్ కపుల్?

5 hours ago

latest news

Rishab Shetty: ‘కుందాపుర్‌’ బాయ్స్‌ కలసి… తారక్‌ సినిమాలో కన్నడ స్టార్‌ హీరో?

Rishab Shetty: ‘కుందాపుర్‌’ బాయ్స్‌ కలసి… తారక్‌ సినిమాలో కన్నడ స్టార్‌ హీరో?

28 mins ago
Priyanka Mohan: పవన్‌ ఇప్పుడు కొంచెం నవ్వుతున్నారు.. ప్రియాంక కామెంట్స్‌ వైరల్‌

Priyanka Mohan: పవన్‌ ఇప్పుడు కొంచెం నవ్వుతున్నారు.. ప్రియాంక కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
Prabhas: ‘ఓజి’ లో నిజంగానే ప్రభాస్ ఉన్నాడా?

Prabhas: ‘ఓజి’ లో నిజంగానే ప్రభాస్ ఉన్నాడా?

19 hours ago
Anasuya Bharadwaj: రంగమ్మత్త వింత ఫోజులు.. హాట్ టాపిక్ అయిన అనసూయ లేటెస్ట్ ఫోటోలు

Anasuya Bharadwaj: రంగమ్మత్త వింత ఫోజులు.. హాట్ టాపిక్ అయిన అనసూయ లేటెస్ట్ ఫోటోలు

22 hours ago
గ్రామీణ రాజకీయాలలో స్త్రీలు కీలకపాత్ర పోషిస్తే ఎలా ఉంటుందో సరి కొత్తగా చూపిస్తూ ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్ లాంచ్

గ్రామీణ రాజకీయాలలో స్త్రీలు కీలకపాత్ర పోషిస్తే ఎలా ఉంటుందో సరి కొత్తగా చూపిస్తూ ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్ లాంచ్

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version