నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ కార్తికేయ 2. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఇది.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ల పై టి.జి.విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ లు సంయుక్తంగా నిర్మించారు. ద్వారకా నగరంలో చోటు చేసుకునే ఊహించని పరిణామాలు, అక్కడ జరిగే ప్రమాదాలు వంటి అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. కార్తికేయ చిత్రంలోలానే ఈ మూవీలో కూడా ఎన్నో ట్విస్ట్ లు ఉండబోతున్నాయి అని టీజర్, ట్రైలర్ వంటివి స్పష్టంచేశాయి. దీంతో సినిమా పై కూడా మంచి అంచనాలే నెలకొన్నాయి. అందువల్ల బిజినెస్ కూడా బాగా జరిగింది.
ఒకసారి వాటి వివరాలను గమనిస్తే:
నైజాం
4 cr
సీడెడ్
2 cr
ఉత్తరాంధ్ర
2 cr
ఈస్ట్
0.75 cr
వెస్ట్
0.65 cr
గుంటూరు
1.0 cr
కృష్ణా
1.0 cr
నెల్లూరు
0.60 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
12 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.75 cr
ఓవర్సీస్
1.50 cr
మిగిలిన వెర్షన్లు
3 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
17.25 cr
కార్తికేయ 2 చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.17.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.18 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఈరోజు రిలీజ్ అయిన మాచర్ల నియోజకవర్గం చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. కాబట్టి ఆ చిత్రంతో కార్తికేయ కి వచ్చిన ఇబ్బంది లేదు. కానీ సీతా రామం, బింబిసార వంటి చిత్రాలు ఇంకా స్ట్రాంగ్ గా రన్ అవుతున్నాయి. కాబట్టి వాటితో కార్తికేయ పోటీ పడాల్సిందే. పాజిటివ్ టాక్ వస్టే కార్తికేయ సేఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.