ఈ నెల 28 వ తేదీన బాహుబలి కంక్లూజన్ ని విడుదల చేసే పనుల్లో చిత్ర బృందం బిజీగా ఉంటే కొన్ని చిక్కులు ఇబ్బంది కలిగిస్తున్నాయి. అలంటి వాటిల్లో కర్ణాటక బంద్ ఒకటి. కొన్నేళ్ల క్రితం కావేరీ జలాల విషయంలో సత్యరాజ్ అమర్యాదకంగా మాట్లాడారని. అందుకే అతను నటించిన సినిమా విడుదలయ్యే రోజున రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తామని కన్నడ చలవలి వటల్ అధ్యక్షుడు వటల్ నాగరాజ్ చెబుతున్నారు. ఈ సినిమాను కర్ణాటకలో నిషేధించాలని కొన్ని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై రాజమౌళి ఈరోజు స్పందించారు.
“నేను సత్యరాజ్‌తో ఐదేళ్లు కలిసి పనిచేశా. ఇన్నేళ్లల్లో ఆయన ఎప్పుడూ ఎదుటివారిని బాధపట్టే వ్యక్తిగా అనిపించలేదు. కొన్ని వీడియోలను ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశారు. వాటిని చూసి మేము విచారించగా.. తొమ్మిదేళ్లకు ముందు సత్యరాజ్ ఆ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ఆ తర్వాత సత్యరాజ్ నటించిన 30 సినిమాలు కర్ణాటకలో విడుదలయ్యాయి. ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ కూడా విడుదలవుతోంది. అయితే ఈ సమయంలో పాత విషయాన్ని దుమారం రేపడం మంచిది కాదు’ అని రాజమౌళి అన్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.