ఎవరింట్లో అయినా విషాదం చోటు చేసుకుంటే.. ఆ ఇంటి సభ్యులు తొందరగా సాధారణ స్థితికి రాలేదు. వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అన్న సంగతి అందరూ అంచనా వేసుకోగలరు. ఇందుకు సెలబ్రిటీలు ఏమీ అతీతం కాదు. అయితే ఓ నటి చేసిన పనికి అంతా షాకవుతున్నారు. తన భర్త చనిపోయిన రెండు రోజులకే ఆమె చేసిన పనికి అయోమయానికి గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ సీనియర్ నటుడు రసిద్ దేవ్…
మూత్రపిండాలు దెబ్బతినడంతో ఇటీవల కన్నుమూశారు. గత నాలుగేళ్లుగా ఆయన కిడ్నీ ప్రాబ్లమ్ తో బాధపడుతూ వస్తున్నట్లు తెలుస్తుంది.పరిస్థితి విషమించడంతో ఆయన జులై 30న మరణించారు. అయితే అతని భార్య కూడా నటి అన్న సంగతి తెలిసిందే. ఆమె మరెవరో కాదు కేత్కి దేవ్. భర్త చనిపోయిన రెండు రోజులకే ఈమె షూటింగ్‌లో పాల్గొందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ‘భర్త చనిపోయినప్పటికీ నేను షూటింగులకు బ్రేక్ తీసుకోలేదని’ సమాధానమిచ్చింది.
ఈ సంఘటనకు ముందుగా డేట్స్ ఇచ్చేన సినిమాల కోసం… తన వల్ల దర్శక నిర్మాతలు నష్టపోకూడదు. నటీనటులకు కాల్ షీట్ల ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశంతో ఆమె ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. 1983 వ సంవత్సరంలో రసిద్ దేవ్- కేత్కి ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఈ దంపతులకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. ‘బాలికా వధు’,క్యోంకీ సాస్ బీ కబీ బహు తీ’ వంటి పలు హిందీ సినిమాలతో పాటు గుజరాతీ సినిమాల్లో కూడా కేత్కి దేవ్ నటించి మెప్పించింది.