ఇప్పుడంతా పాన్ ఇండియా చిత్రాల హవా నడుస్తుంది. ఎంతో మంది స్టార్ హీరోలు.. దర్శకులు ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. వీటికి పునాది వేసిన చిత్రాలు రెండే రెండు. ఒకటి ‘బాహుబలి’ .. రెండు ‘కె.జి.ఎఫ్’. సౌత్ సినిమాని తక్కువగా చూసినవారందరికీ ఈ చిత్రాలు గట్టి సమాధానాలు చెప్పాయని చెప్పాలి. ఇక ‘బాహుబలి’ ని రూపొందించిన రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్.ఆర్.ఆర్’ .. అలాగే ‘కె.జి.ఎఫ్’ సీక్వెల్ అయిన ‘కె.జి.ఎఫ్ చాప్టర్2’ సినిమాలు రాబోతుండడంతో వాటి పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా కోసం ఇంటర్నేషనల్ వైడ్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మొదట ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని ఈ ఏడాది జూలై 30న విడుదల చేస్తున్నారని ప్రకటించారు.. అదే టైములో ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ కూడా జూలై కు పోస్ట్ పోన్ అయ్యింది అని వార్తలు రాగానే రెండు సినిమాలకి భారీ పోటీ తప్పదని అంతా ఫిక్సయ్యారు. కానీ ఆ తర్వాత ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం 2021 జనవరి 8 కి పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హీరో యష్ ఈ విషయం పై స్పందించాడు.. ‘ఆర్.ఆర్.ఆర్’ తో ‘కె.జి.ఎఫ్ చాప్టర్2’ ను పోటీగా దించడం పిచ్చి పనే అవుతుంది. అలాంటి పని మేం చెయ్యము. ‘ఆర్.ఆర్.ఆర్’ టీంతో మేము తరచుగా సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని అప్పటి వరకూ జూలైలోనే విడుదల చెయ్యాలి అని వారనుకున్నప్పుడు ‘కె.జి.ఎఫ్2’ రిలీజ్ డేట్ ను చేంజ్ చేయమని వారు కోరారు. అయితే సంక్రాంతికి ‘ఆర్.ఆర్.ఆర్’ చేంజ్ అయ్యింది కాబట్టి మేము జూలై విడుదల చేసుకునే ప్లాన్ చేస్తున్నాం” అంటూ చెప్పుకొచ్చాడు.