భీమ్లా నాయక్ సినిమాలోని లాలా భీమ్లా సాంగ్ ద్వారా కిన్నెర మొగులయ్య ఓవర్ నైట్ లో పాపులారిటీని సంపాదించుకున్నారనే సంగతి తెలిసిందే. 12 మెట్ల కిన్నెరను వాయిస్తున్న అతికొద్ది మంది కళాకారులలో కిన్నెర మొగులయ్య ఒకరు కావడం గమనార్హం. కిన్నెర వాయించడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా మొగులయ్య మాత్రం ఈ కళకే పరిమితమయ్యారు. తాజాగా మొగులయ్య కళారంగానికి చేసిన సేవల వల్ల పద్మశ్రీ పురస్కారం దక్కింది. పద్మశ్రీ పురస్కారం దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం అనే సంగతి తెలిసిందే.
అయితే తాజాగా మొగులయ్య పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కిచ్చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను ఏ ప్రభుత్వం ఆదుకోకపోయినా తెలంగాణ ప్రభుత్వం ఆదుకుందని మొగులయ్య అన్నారు. ఆ మధ్య తాను పాట పాడటం వల్ల తనకు పద్మశ్రీ వచ్చిందని మొగులయ్య కామెంట్లు చేశారు. రాష్ట్రపతి చేతుల మీదుగా తాను పద్మశ్రీ అవార్డ్ ను తీసుకున్నానని కోటి రూపాయల డబ్బుతో పాటు హైదరాబాద్ లో 300 గజాల స్థలం తనకు ఇచ్చారని మొగులయ్య చెప్పారు.
అయితే బీజేపీ వాళ్లు తెలంగాణ సీఎం తన ఇంటినుంచి కోటి రూపాయలు ఇస్తున్నాడా? అని ప్రశ్నించారని మొగులయ్య కామెంట్లు చేశారు. పద్మశ్రీ బీజేపీ వాళ్లదే అయితే అది తనకు అవసరం లేదని మొగులయ్య పేర్కొన్నారు. నాకు బద్నాం ఎందుకని ఆయన ప్రశ్నించారు. పద్మశ్రీ ఎవరిదైనా సరే తాను తిరిగి ఇచ్చేస్తానని తాను పేదోడినని తన నోట్లో మన్ను పోస్తే పాపం తగులుతుందని మొగులయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
మొగులయ్య చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మొగులయ్య ఆవేదనలో కూడా న్యాయం ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. భీమ్లా నాయక్ సినిమా సక్సెస్ తర్వాత మొగులయ్యకు సినిమా ఆఫర్లు కూడా గతంతో పోలిస్తే పెరిగాయి. మొగులయ్య తనకు వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.