జబర్దస్త్ షోతో పాటు ఇతర షోల ద్వారా ఊహించని స్థాయిలో పాపులర్ అయిన కమెడియన్లలో కిర్రాక్ ఆర్పీ ఒకరు. ప్రస్తుతం టీవీ షోలకు దూరంగా ఉన్న కిర్రాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ద్వారా భారీగానే ఆదాయం సంపాదిస్తున్నారు. ఈ కర్రీ పాయింట్ ఊహించని స్థాయిలో క్లిక్ అయింది. 50 లక్షల రూపాయల పెట్టుబడితో ఈ కర్రీ పాయింట్ ను మొదలుపెట్టగా రోజుకు 2 లక్షల రూపాయల నుంచి 3 లక్షల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతోంది.
అయితే గత కొన్నిరోజులుగా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు గురించి సోషల్ మీడియాలో కొన్ని నెగటివ్ కామెంట్లు రావడంతో పాటు వెబ్ మీడియాలో సైతం కొన్ని నెగిటివ్ కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ కథనాలు ఆర్పీ దృష్టికి రావడంతో ఆర్పీ ఆ కామెంట్ల గురించి స్పందిస్తూ ఒకింత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తన చేపల పులుసుపై పగబట్టారనే అర్థం వచ్చేలా కిర్రాక్ ఆర్పీ కామెంట్లు చేశారు. కొంతమంది కావాలనే చేపల పులుసు గురించి నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారని ఆర్పీ కామెంట్లు చేశారు.
నాపై పగబట్టారని నా షాప్ ను మూయించాలని చూస్తున్నారని ఆర్పీ చెప్పుకొచ్చారు. చేపల పులుసును రుచి చూసిన పాత కస్టమర్లు కొత్త కస్టమర్లను తీసుకొని వస్తున్నారని ఒక్కరు నెగిటివ్ గా చెప్పినంత మాత్రాన తనకేం నష్టం కలగదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. కిర్రాక్ ఆర్పీ కామెంట్ల గురించి చేపల పులుసు టేస్ట్ చేసిన వాళ్లు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.
కిర్రాక్ ఆర్పీ నెగిటివ్ కామెంట్లను పట్టించుకోకుండా ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. సక్సెస్ లో ఉన్నవాళ్లపై నెగిటివిటీ సాధారణం అనే సంగతి తెలిసిందే. ఈ నెగిటివిటీని అధిగమించే దిశగా కిర్రాక్ ఆర్పీ అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.