కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘మిర్చి’ ‘శ్రీమంతుడు’ ‘జనతా గ్యారేజ్’ ‘భరత్ అనే నేను’ చిత్రాలకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. వీళ్ళ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. కొరటాల వివరించే సీన్ మూడ్ తగ్గట్టు సంగీతం అందిస్తుంటాడు దేవి శ్రీ ప్రసాద్. అయితే ‘ఆచార్య’ చిత్రంతో వీళ్ళ మధ్య గ్యాప్ ఏర్పడింది. దేవి శ్రీ ప్రసాద్ ఫామ్లో లేడు అనే ఉద్దేశంతో దేవి ని పక్కన పెట్టి మణిశర్మని తీసుకున్నాడు కొరటాల.
అది కూడా చిరు ఒత్తిడి వల్ల అన్న సంగతి అందరికీ తెలిసిందే. ‘ఆచార్య’ షూటింగ్ టైంలో ‘దేవి ఈ ఒక్క సినిమాకే నిన్ను పక్కన పెట్టాను. తర్వాత మన జర్నీ అలాగే రన్ అవుతుంది’ అంటూ కొరటాల చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు కొరటాల మాట తప్పినట్టే కనిపిస్తుంది. ఎన్టీఆర్ 30 వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నాడు కొరటాల శివ.
ఈసారి కూడా హీరో ఎన్టీఆర్ ఒత్తిడి కొరటాల పై ఉంది. అసలే ‘ఆచార్య’ తో పెద్ద డిజాస్టర్ ను ఫేస్ చేశాడు కాబట్టి.. కొరటాల ఎన్టీఆర్ మాట వినక తప్పడం లేదు.ఈ కారణంతో కొరటాల మాట తప్పినట్టు అయ్యింది. ఈ చిత్రం కోసం అనిరుధ్ కు ఏకంగా రూ.4 కోట్లు పారితోషికం ఇస్తున్నారట. దేవి ఫామ్లో లేకపోవడం వల్ల.. హీరోలు దర్శకుల పై ఒత్తిడి పెడుతున్నారు. కనీసం కొరటాలకి ప్లాప్ పాడకపోయినా అతని మాట చెల్లేదేమో.
నిజానికి ‘అరవింద సమేత’ కి అనిరుధ్ సంగీతం అందించాలి కానీ మిస్ అయ్యింది. కొరటాల మూవీతో అనిరుధ్ తో వర్క్ చేయాలనే కోరిక తీర్చుకుంటున్నాడు ఎన్టీఆర్. ‘యువ సుధా ఆర్ట్స్’ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనుండగా.. కళ్యాణ్ రామ్ సమర్పకుడిగా వ్యవహరించనున్నాడు.