ఈ మధ్యకాలంలో సినిమాల రీషూట్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి. భారీ బడ్జెట్ సినిమాలంటే రీషూట్స్ పక్కా ఉంటాయి. కొన్ని సినిమాల్లో అయితే.. ఏకంగా క్యారెక్టర్ ను మార్చేసి.. మళ్లీ కొత్తవాళ్లతో సీన్లు తీస్తుంటారు. అలాంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. సినిమా పూర్తయినా.. లాక్ డౌన్ సమయంలో ఆ సినిమాను చూసుకొని మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం దక్కింది. దీంతో రీషూట్లు మొదలైపోయాయి. ‘ఆచార్య’ సినిమా విషయంలో కూడా చాలానే రీషూట్లు జరిగాయని వార్తలొచ్చాయి.
వీటిపై కొరటాల తొలిసారి స్పందించారు. ‘ఆచార్య’కు రీషూట్ల అవసరం పడలేదని చెబుతూనే.. రీషూట్స్ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. గతంలో నాగార్జున కూడా ఇలానే మాట్లాడారు. ‘సోగ్గాడు చిన్ని నాయన’ సినిమా కోసం రీషూట్స్ చేయడం గురించి మీడియా ఆయన్ను ప్రశ్నించగా.. దానికి నాగార్జున ‘కరెక్షన్స్ ఉంటే చేసుకోవడంలో తప్పేముందని’ అన్నారు. ఇప్పుడు కొరటాల శివ కూడా అలానే రియాక్ట్ అయ్యారు. ‘రీషూట్ అనేది ఓ తప్పుడు భావన కింద తీసుకుంటారు.
రీషూట్ చేయడంలో తప్పేముంది? ఓ సీన్ అనుకున్నట్టు రాకపోతే.. మరోసారి తీయొచ్చు. సరిగా లేకపోయినా పాస్ చేయలేం. అది సినిమాని నమ్మి వచ్చే ప్రేక్షకులకు అన్యాయం చేయడం వంటిదే. ఓ సీన్ బాగా వచ్చేంత వరకూ ఎన్నిసార్లయినా తీయొచ్చు. ఫైనల్ గా ప్రేక్షకుడికి ఆ సీన్ నచ్చేలా చేయడమే దర్శకుడి బాధ్యత’ అంటూ చెప్పుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆచార్య’ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజాహెగ్డే హీరోయిన్లుగా నటించారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిచారు.