అపజయమెరుగని దర్శకుడిగా కొరటాల శివ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన సినిమాల్లో భారీ భారీ ఫైట్ లు, మాస్ పాటలతో పాటు ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది. ‘మిర్చి’ ‘శ్రీమంతుడు’ ‘జనతా గ్యారేజ్’ ‘భరత్ అనే నేను’ చిత్రాలు వేటికవే ప్రత్యేకమైనవి. ఇక కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆచార్య’ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల చేసిన ట్రైలర్, సాంగ్ ప్రోమోలు, పాటలు, టీజర్లు అన్నీ కూడా ప్రామిసింగ్ గా ఉన్నాయి.
రెండేళ్ళుగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 29 న విడుదల కాబోతుంది. ఇదిలా ఉండగా.. కొరటాల శివ మొదటి 4 సినిమాలకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఆ సినిమాలు అన్నీ మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. అయితే ‘ఆచార్య’ కి మాత్రం మణిశర్మని ఎంపిక చేసుకున్నాడు. దేవి ఫామ్లో లేని కారణంగా చిరు బలవంతం మీద అయిష్టంగానే మణిశర్మని ఎంపిక చేసుకున్నాడు కొరటాల.
ఆయన అసహనం ఇన్నాళ్టికి బయటపడినట్టు ఇన్సైడ్ టాక్. విషయం ఏంటంటే ఫిబ్రవరి 4న విడుదల కావాల్సిన ‘ఆచార్య’ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంప్లీట్ అవ్వని కారణంగానే ఇన్నాళ్లు వాయిదా పడుతూ వచ్చిందట. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు.పైగా చిరుకి ఆయన ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చారు. కానీ కొరటాల మాత్రం ఇది కాదు ఇంకోటి అంటూ మణిశర్మని ఇబ్బంది పెట్టేవారట.
మణిశర్మ కంపోజ్ చేసే ట్యూన్స్ కొరటాల మూడ్ కు తగ్గట్టు లేకపోవడం వల్లనే ఇలా ఆయన తిప్పలు పడినట్టు తెలుస్తుంది. చివరికి మణిశర్మతో సెట్ అవ్వక అతని కొడుకు మహతి స్వర సాగర్ తో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయించినట్టు తెలుస్తుంది.