మంచి టైమింగ్ ఉన్న నటుడు కృష్ణ భగవాన్. రైటర్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత నటుడిగా మారిపోయారు. అలా వంశీ సినిమాల స్పెషల్‌గా నిలిచారాయన. సెకండ్ ఇన్నింగ్స్‌లో అందరి సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తెర మీద ఆయన నటన ఎంత ఫేమసో, షూటింగ్స్‌లో ఆయన నోటి దూల కూడా అంతే ఫేమస్. సినిమా షూటింగ్స్‌లో కృష్ణభగవాన్ సరదాగా వేసే జోకులు, పంచ్‌లు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయట.
నా నోటి దూల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా అంటూ ఇటీవల ఓ షోలో కృష్ణభగవాన్ చెప్పుకొచ్చారు. ఆ మధ్య ఒక నటుడు కృష్ణభగవాన్ దగ్గర ‘‘నేను నిజ జీవితంలో అసలు నటించను’’ అంటూ తన గురించి చెప్పబోయాడు. ఆయన ఆ మాట ఇంకా పూర్తి చేయనేలేదు… ‘అది తెర మీద కూడా తెలుస్తోంది’ నేను కౌంటర్ వేసేశారు కృష్ణభగవాన్. దీంతో ఆ నటుడు చిన్నబుచ్చుకున్నారట. మరోసారి ఒక పెద్ద నటుడి విషయంలోనూ ఇలాగే జరిగిందట.
ఓ నటుడు ఎప్పుడూ, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అయితే ఒకసారి సెట్లో మౌనంగా కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన కృష్ణభగవాన్ వచ్చి ‘ఏమైంది’ అని అడిగారట. దానికి ఆయన ‘నేను ఐదు నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడితే వెర్రోడిలా చూస్తున్నారు’ అని అన్నాడట. దానికి కృష్ణభగవాన్ ‘ఏంటీ.. ఆ విషయం వాళ్లకు తెలియడానికి అంత టైమ్ పడుతోందా’ అంటూ కౌంటర్ వేశారట. దాంతో ఆయన కూడా నొచ్చుకున్నాడట. ఇలా చాలా సార్లు నోటి తొందర వల్ల చాలామంది నన్ను తిట్టుకున్నారని కృష్ణభగవాన్ చెప్పుకొచ్చారు. అయితే అతను అనాలని.. అనరట.