ఆంగ్ల పత్రికపై మండిపడిన హాట్ హీరోయిన్
- June 1, 2019 / 06:30 PM ISTByFilmy Focus
క్యాన్సర్ ని జయించి ప్రస్తుతం మరోసారి బాలీవుడ్ లో బిజీ అవుతుంది నటి లీసా రే. క్యాన్సర్ వల్ల తాను అనుభవించిన మనోవేదనను.. నరకాన్ని `క్లోజ్ టు ది బోన్` పేరుతో పుస్తకం రాసి తాజా విడుదల చేస్తుంది. ఈ పుస్తకంపై ప్రఖ్యాత ఆంగ్ల దినపత్రికలో ఓ వ్యాసం వచ్చింది. అయితే ఆ వ్యాసానికి ఉపయోగించిన ఫోటో అభ్యంతరకరంగా ఉందంటూ లీసారే మండిపడడం హాట్ టాపిక్ గా మారింది.
- సీత సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- లిసా సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- ఎబిసిడి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- మహర్షి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
అసలు ఆ సందర్భానికి ఏ ఫోటో వాడాలో తెలీదా.. అంత అసభ్యంగా ఉన్న ఫోటోని వేస్తారా.. అంటూ చిరాకును వ్యక్తం చేసింది.ఈ ఫోటో చూసి చాలా నిరాశ పడ్డాను. సదరు పత్రికా నిర్వాహకులు ఇలా చేయడం బాలేదని ట్వీట్ చేసింది. ప్రస్తుతం మోడలింగ్ కెరియర్ తో పాటు బాలీవుడ్ కెరియర్ పైనా లీసా దృష్టి సారించింది. 47 ఏళ్ల లీసారే క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత అదే ఉత్సాహంతో పని చేస్తుండడం యువతరానికి స్ఫూర్తిమంతం.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus











