నచ్చావులే సినిమాతో అందరికి నచ్చిన తెలుగు బ్యూటీ మాధవీలత. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో చురుకుగా ఉంటోంది. అలాగే బీజేపీ లోచేరి.. ఆ ప్రభుత్వం చేసిన పనుల గురించి ప్రజలకు చేరవేస్తుంది. తాజాగా ఆమె శ్రీనగర్ కాలనీలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పొల్గొంది. అనంతరం దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ నేపథ్యంలో కొందరు నెటిజన్లు “మాధవీలత పొట్టిది” అంటూ కామెంట్లు పెట్టారు. ఈ విమర్శలపై మాధవీలత లైవ్ లో ఘాటుగా స్పందించింది. “అవునురా బై.. నేను పొట్టిగానే ఉంటా. నీకేమైనా నొప్పి వచ్చిందా? నీకేమయినా మాయరోగం వచ్చిందా? నీకేమయినా పోయేకాలం వచ్చిందా? లేదు కదా.
మీ అమ్మ, మీ అక్కా, మీ చెల్లి అంతా పొడవుగానే ఉన్నారు కదా. ఇంక హ్యాపీగా ఉండు. నాకు లేనిది మీకున్నందుకు సంతోషించండి. నామీద పడి ఎందుకు ఏడుస్తారు? నేను పొట్టిగా ఉండటం వల్ల ఎవడికైనా నొప్పివస్తే.. వెళ్లి ఆసుపత్రిలో చూపించుకోండి. ఫోటో పెడితే నచ్చితే నచ్చింది.. లేదంటే నచ్చలేదు అని చెప్పాలి. నేను పొట్టిదాన్నే.. నేను నల్లగా ఉంటా. అయితే నీకేంటి? నీకు నచ్చకపోతే నా పేజ్ నుంచి వెళ్లిపో’ అని ఆగ్రహంతో ఊగిపోయింది. దీంతో నెటిజనులు మాధవిలతతో జాగ్రత్తగా ఉండాలని, లేకుంటే తిట్లు తప్పవని నిర్ధారణకు వచ్చారు.