‘నేషనల్ క్రష్.. ఇదేం యాడ్ అమ్మా’.. అంటూ రష్మిక పై ట్రోలింగ్..!

నాగ శౌర్య హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఛలో’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక అనతి కాలంలోనే స్టార్ డం ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగుతో పాటు తమిళ, మలయాళంలో కూడా సినిమాలు చేస్తోంది.అంతేకాదు ‘నేషనల్ క్రష్’ అనే బిరుదుని కూడా సొంతం చేసుకుంది.ప్రస్తుతం బాలీవుడ్లో వరుసగా రెండు సినిమాల్లో నటిస్తుంది రష్మిక. వాటితో పాటు అక్కడ మరిన్ని ఆఫర్లు ఈమెను వెతుక్కుంటూ వస్తున్నట్టు భోగట్టా.

ఇది పక్కన పెడితే.. బాలీవుడ్లో ఈమె మొదటి సినిమా విడుదలయ్యే లోపు అక్కడి ప్రేక్షకులకు దగ్గరవ్వాలని ఈమె గట్టి ప్రయత్నాలే చేస్తుంది. ఇందులో భాగంగా అక్కడి స్టయిల్లో పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుని ఫోటో షూట్లలో పాల్గొంటుంది. అంతేకాకుండా.. పలు యాడ్స్ లో కూడా నటిస్తుంది. ఇదే క్రమంలో ఓ అండర్ వేర్ యాడ్ లో నటించింది రష్మిక. ఈ యాడ్ లో రష్మిక తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ కూడా నటించాడు.

పాపులర్ బ్రాండెడ్ ఇన్నర్ వేర్ వేసుకున్న వ్యక్తిని అదే పనిగా చూస్తూ తృప్తి చెందే అమ్మాయిగా ఈ యాడ్ లో రష్మిక కనిపిస్తుంది. ఇవి మొత్తం రెండు యాడ్స్. ఈ యాడ్స్ లో రష్మిక పలికించిన హావభావాలు.. తీవ్ర విమర్శలకు దారితీశాయనే చెప్పాలి. ‘నేషనల్ క్రష్ ఇవేం పనులమ్మా’ ‘ఫ్యాన్స్ పరువు తీసేసింది’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!


హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Share.