నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్..లు హీరోలుగా ‘మ్యాడ్’ వచ్చింది. కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేసిన ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఆ చిత్రానికి సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) వచ్చింది. ఉగాది కానుకగా మార్చి 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది.
Mad Square Collections:
3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి… ఆ తర్వాత కూడా బాగా క్యాష్ చేసుకుంది. ఎన్టీఆర్ సక్సెస్ మీట్ కి వచ్చి సినిమాకు మరింత బూస్ట్ ఇచ్చాడు. ఇక ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) క్లోజింగ్ కలెక్షన్స్ ను ఒకసారి గమనిస్తే :
‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) సినిమాకు రూ.20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.21 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ఫుల్ రన్ ముగిసేసరికి ఏకంగా రూ.38.15 కోట్లు షేర్ ను రాబట్టింది. మొత్తంగా బయ్యర్స్ కి రూ.17.15 కోట్ల లాభాలను అందించి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. గ్రాస్ పరంగా రూ.59 కోట్ల వరకు కొల్లగొట్టింది.