12 ఏళ్ళ క్రితం విశాల్ (Vishal) ,అంజలి (Anjali), వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) కాంబినేషన్లో తెరకెక్కిన ‘మదగజరాజ’ (Madha Gaja Raja) సినిమా కొన్ని కారణాల వల్ల రిలీజ్ కాలేదు. పారితోషికం విషయంలో సంతానం చిత్ర బృందం పై కేసు వేయడం.. అలాగే కొన్ని ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆగిపోయింది. అయితే పుష్కరం తర్వాత రిలీజ్ అయినా తమిళంలో మంచి విజయాన్ని అందుకుంది. సంక్రాంతికి తమిళంలో పెద్ద సినిమాలు లేకపోవడంతో ఈ సినిమాకి బాగా కలిసొచ్చింది. దీంతో అక్కడ రూ.50 కోట్ల పైనే గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
దీంతో జనవరి 31న తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ మాత్రం ‘మదగజరాజ’ కి టికెట్లు తెగలేదు. రివ్యూస్ పర్వాలేదు అనిపించే విధంగా వచ్చాయి. కానీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మేనియాలో కొట్టుకుపోయింది. ఒకసారి ‘మదగజరాజ’ క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.38 cr |
సీడెడ్ | 0.18 cr |
ఉత్తరాంధ్ర | 0.35 cr |
ఈస్ట్ | 0.91 cr |
‘మదగజరాజ’ (Madha Gaja Raja) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.2.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.2.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ ఫుల్ రన్ ముగిసేసరికి తెలుగులో కేవలం రూ.0.91 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి రూ.1.59 కోట్ల షేర్ దూరంలో ఆగిపోయి డిజాస్టర్ గా మిగిలిపోయింది. గ్రాస్ పరంగా రూ.1.42 కోట్లు రాబట్టింది.