శర్వానంద్ హీరోగా మెహ్రీన్ పీర్జాడా హీరోయిన్ గా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మహానుభావుడు’. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ పై వి.వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ లు నిర్మించారు. 2017వ సంవత్సరం సెప్టెంబర్ 29న ఈ చిత్రం విడుదలైంది.నేటితో ఈ చిత్రం విడుదలై 4 ఏళ్ళు పూర్తికావస్తోంది. భారీ అంచనాల నడుమ విడుదలైన మహేష్ బాబు- మురుగదాస్ ల ‘స్పైడర్’ చిత్రం పక్కన ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘మహానుభావుడు’ చిత్రం హిట్ టాక్ ను అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు పోటీలో ఈ చిత్రమే పై చేయి సాధించిందని చెప్పాలి.
మరి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం
6.01 cr
సీడెడ్
2.56 cr
ఉత్తరాంధ్ర
2.81 cr
ఈస్ట్
1.70 cr
వెస్ట్
1.10 cr
గుంటూరు
1.88 cr
కృష్ణా
1.63 cr
నెల్లూరు
0.59 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
18.28 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
2.60 Cr
ఓవర్సీస్
2.10 Cr
వరల్డ్ వైడ్ (టోటల్)
22.98 cr
‘మహానుభావుడు’ చిత్రానికి రూ.21.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.22.98 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే బయ్యర్లకు రూ.1.28 కోట్ల వరకు లాభాలు మిగిలాయని చెప్పొచ్చు. ఆ ఏడాది ‘శతమానం భవతి’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న శర్వానంద్ అటు తర్వాత వచ్చిన ‘రాధా’ తో డిజాస్టర్ మూటకట్టుకున్నాడు. ‘మహానుభావుడు’ చిత్రం మళ్ళీ అతన్ని హిట్ ట్రాక్ ఎక్కించింది. అయితే ఈ మూవీ తర్వాత శర్వానంద్ ఇప్పటివరకు మరో హిట్టు అందుకోలేక సతమతమవుతున్నాడు.