మహేష్ బాబు 25 వ చిత్రంగా వచ్చిన ‘మహర్షి’ చిత్రం 18 రోజుల కలెక్షన్లు బయటకి వచ్చాయి. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం విడుదలయ్యి మూడు వారంలోకి ఎంటర్ అయినప్పటికీ డీసెంట్ రన్ కొనసాగిస్తోంది. ‘భరత్ అనే నేను’ అంత బ్లాక్ బస్టర్ టాక్ ‘మహర్షి’ చిత్రానికి రానప్పటికీ… సమ్మర్ హాలిడేస్ కావడం పక్కన మరే పెద్ద సినిమా లేకపోవడం.. వచ్చిన చిన్న సినిమాలు కూడా ప్లాపవ్వడంతో.. ‘మహర్షి’ చిత్రం సేఫ్ అయిపోయింది. ఇక ‘మహర్షి’ చిత్రం 18 రోజులు పూర్తయ్యేసరికి ప్రపంచ వ్యాప్తంగా 94.08 కోట్ల షేర్ ను రాబట్టింది.
‘మహర్షి’ 18 రోజుల ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
వెస్ట్ – 5.41 కోట్లు
కృష్ణా – 5.31 కోట్లు
గుంటూరు – 7.39 కోట్లు
నెల్లూరు – 2.57 కోట్లు
———————————————
ఏపీ + తెలంగాణా – 73.63 కోట్లు
(టోటల్)
రెస్ట్ అఫ్ ఇండియా – 10.25 కోట్లు
ఓవర్సీస్ – 10.20 కోట్లు
———————————————
వరల్డ్ వైడ్ టోటల్ – 94.08 కోట్లు
———————————————
‘మహర్షి’ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా 95 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 18 రోజులు పూర్తయ్యేసరికి వరల్డ్ వైడ్ 94.08 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 1 కోటి రాబట్టాల్సి ఉంది. మొదట్లో కాస్త తడబడినా చివరికి స్టడీ గా బ్రేక్ ఈవెన్ కు దగ్గరపడింది ‘మహర్షి’ చిత్రం. నైజాం లో ఈ చిత్రానికి మంచి లాభాలు వచ్చాయి.. అలాగే ‘నాన్ బాహుబలి’ గా నిలిచింది. టికెట్ రేట్లు పెంచడం.. జి.ఎస్.టి తగ్గించడంతో నైజాంలో మంచి కలెక్షన్లను రాబట్టింది. దాదాపు అన్ని ఏరియాలు ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి బ్రేక్ ఈవెన్ అయిపోయే అవకాశం ఉంది. కానీ ఓవర్సీస్, సీడెడ్ ఏరియాల్లో మహర్షికి నష్టాలు తప్పవని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మహేష్ కు పిచ్చ క్రేజ్ ఉన్న ఓవర్సీస్లో ఈ చిత్రం కానీ కష్టంగా 1.8 మిలియన్ దాటింది. ఫుల్ రన్లో 1.9 లేదా 2 మిలియన్ కు దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. కానీ అక్కడ బయ్యర్స్ సేఫ్ అవ్వాలంటే ఈ చిత్రం 2.5 మిలియన్ రాబట్టాల్సి ఉంది. కానీ అది అసాధ్యమని ట్రేడ్ పండితులు తేల్చేసారు. ఇక మహేష్ కెరీర్లో ఈ చిత్రం బిగ్గెస్ట్ కలెక్షన్లను రాబట్టిన చిత్రం అని చెప్పడంలో సందేహం లేదు. అయితే ‘రంగస్థలం’ ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రాల కలెక్షన్ల వరకూ వెళ్ళే అవకాశం లేదనే చెప్పాలి. ఏమైనా ‘మహర్షి’ చిత్రం మహేష్ కెరీర్లో హిట్ గా నిలవడం ఖాయం. 25 వ చిత్రంతో పవన్, ఎన్టీఆర్ లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా… మహేష్ మాత్రం తన ల్యాండ్ మార్క్ చిత్రాన్ని విజయం వైపు మళ్ళించాడు. రికార్డులు అనేవి పక్కన పెడితే ‘మహర్షి’ మహేష్ కెరీర్లో ఓ ల్యాండ్ మార్క్ చిత్రంగా నిలిచిపోతుంది.