టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ చిత్రం మే 9న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం మహేష్ బాబు కు 25 వ చిత్రం కావడం విశేషం. దీంతో ఈ చిత్రానికి ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఓ రేంజ్లో నిర్వహించనున్నారు. హైదరాబాదులోని పీపుల్స్ ప్లాజాలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ ఆడియో వేడుకకి మరింత ప్రధానాకర్షణ కలిగించేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తుందట.
ఇందులో భాగంగా మహేష్ 24 చిత్రాల దర్శకులని ఈ వేడుకకి ఆహ్వానిస్తున్నారట. గతంలో గోపీచంద్ కూడా తన 25 వ సినిమా అయిన ‘పంతం’ కు కూడా ఇలానే తన 24 చిత్రాల దర్శకులని ఆహ్వానించాడు. ఇప్పుడు మహేష్ కూడా ఇదే ఫార్ములాని ఫాలో అవుతున్నాడన్న మాట. దిల్ రాజు, అశ్విని దత్, ప్రసాద్ వి పొట్లూరి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్తాన్ని భారీగా విడుదల చేయబోతున్నారు. మహేష్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. అల్లరి నరేష్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. పవన్ కళ్యాణ్, నితిన్, గోపీచంద్ వంటి హీరోల 25 వ చిత్రాలు అట్టర్ ప్లాపులుగా నిలిచాయి. ఒక్క ఎన్టీఆర్ 25 వ చిత్రం ‘నాన్నకు ప్రేమతో’ మాత్రం యావరేజ్ గా నిలిచింది. మరి మహేష్ 25 వ చిత్ర ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.