Suriya: రక్తం చిందిస్తూ.. చెమటోడుస్తున్నాం .. అలాంటివి మానుకోండి!
- September 27, 2022 / 04:08 PM ISTByFilmy Focus
కోలీవుడ్ నటుడు సూర్య తన 42రెండవ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. శివ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ గ్రీన్ స్టూడియో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా షూటింగ్ లోకేషన్ నుంచి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.
ఇలా ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన ఫోటోలలో హీరో సూర్య హీరోయిన్ దిశా పటాని తో పాటు దర్శకుడు కూడా కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ కావడంతో ఈ ఫోటోలపై మేకర్స్ యువి క్రియేషన్స్ గ్రీన్ స్టూడియో స్పందించారు. ఈ సందర్భంగా మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాకి సంబంధించిన ఫోటోలు వీడియోలు లీక్ చేసే వారికి తమదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు.

అందరికీ విన్నపం మా సినిమా సూర్య 42నుంచి కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలు వీడియోలను చూసినవారు డిలీట్ చేస్తే ఎంతో మంచి చేసిన వారు అవుతారు. ఈ సినిమా కోసం ఎంతోమంది రక్తం చిందిస్తూ చెమటోడుస్తూ సినిమా కోసం పనిచేస్తున్నారు. ఈ సినిమా మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలని కోరుకుంటున్నాము. ఇలా షూటింగ్ లొకేషన్ లో తీసిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని కోరుకుంటున్నాము

ఇలా కాదని ఎవరైనా ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తే కాపీరైట్ ఉల్లంఘన కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అంటూ ఈ సందర్భంగా నిర్మాతలు ఈ సినిమా నుంచి లీకైన ఫోటోలు పై స్పందిస్తూ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం మేకర్స్ రిలీజ్ చేసిన ఈ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Please Don’t Share Any Shooting Spot Videos and Photos about #Suriya42 pic.twitter.com/idnGu4VXvz
— Studio Green (@StudioGreen2) September 25, 2022
కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!













