ఓ భాషలో సక్సెస్ అయిన మూవీని తీసుకుని మరో భాషలోకి రీమేక్ చేయడం అనేది కొత్త పద్ధతి కాదు. 1950 ల కాలం నుండి నడుస్తుంది. అయితే మలయాళం, కన్నడ భాషల్లో రూపొందే సినిమాలు రీమేక్ చేయడానికి మేకర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపేవారు కాదు. ఎందుకంటే కన్నడ సినిమాలు చాలా వరకు రీమేక్ లే ఉంటాయి. ఇక మలయాళం సినిమాలు చాలా వరకు డాక్యుమెంటరీలు ఉంటాయి. అవి కూడా లో బడ్జెట్ లో తీసిన సినిమాలు. అయితే కన్నడ సినిమాలు కూడా ఇక్కడ సత్తా చాటుతున్నాయి. అలాగే మలయాళం సినిమాలు కూడా వరుసగా రీమేక్ అవుతున్నాయి. చాలా వరకు అయ్యాయి కూడా..! అయితే తెలుగులో రీమేక్ అయిన మలయాళం సినిమాల్లో ఎన్ని సక్సెస్ అయ్యాయి? అంటే పర్సెంటేజ్ చాలా తక్కువగానే కనిపిస్తుంది. మంచి కంటెంట్ తో రూపొందినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం అవి సక్సెస్ సాధించడం లేదు. ఎందుకంటే హిట్టు సినిమా కదా అని ఇక్కడ ఎక్కువ బడ్జెట్ పెట్టేస్తున్నారు మేకర్స్. సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. టాలీవుడ్లో రీమేక్ అయిన మలయాళం సినిమాలు..? మరియు వాటి ఫలితాలను ఓ లుక్కేద్దాం రండి :
1) ఫలక్ నుమా దాస్ :
విశ్వక్ సేన్ నటించిన ఈ మూవీ ‘అంగమలై డైరీస్’ అనే మలయాళం సినిమాకి రీమేక్. తెలుగులో ఈ మూవీ జస్ట్ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.
2) ఎబిసిడి(2019) :
అల్లు శిరీష్ నటించిన ఈ మూవీ మలయాళంలో అదే పేరుతో దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన ‘ఎబిసిడి’ కి రీమేక్. ఈ మూవీ ఇక్కడ సక్సెస్ సాధించలేదు.
3) ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య :
సత్యదేవ్ హీరోగా రూపొందిన ఈ మూవీ మలయాళంలో ఫహాద్ ఫాజిల్ నటించిన ‘మహేశ్ ఇంటే ప్రతికారం’ కి రీమేక్. ఈ మూవీ లాక్ డౌన్ టైంలో ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. 4) ఇష్క్(2021) :
తేజ సజ్జ, ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన ఈ మూవీ మలయాళంలో అదే పేరుతో రూపొందిన ‘ఇష్క్’ కు రీమేక్. కానీ తెలుగులో మాత్రం ప్లాప్ అయ్యింది.
5) భీమ్లా నాయక్ :
పవన్ కళ్యాణ్ – రానా కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కి రీమేక్. ఈ సినిమా తెలుగులో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.
6) శేఖర్ :
రాజశేఖర్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ మూవీ మలయాళం ‘జోసెఫ్’ కి రీమేక్. కానీ ఈ మూవీ ఇక్కడ ప్లాప్ అయ్యింది.
7) దృశ్యం 2 :
వెంకటేష్ హీరోగా ‘దృశ్యం’ కి సీక్వెల్ గా రూపొందిన ఈ మూవీ డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
8) గాడ్ ఫాదర్ :
మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఈ మూవీ మలయాళం ‘లూసిఫర్’ కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టాలీవుడ్లో పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.
9) రాజు గారి గది 2 :
నాగార్జున, సమంత కీలక పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ మలయాళంలో రూపొందిన ‘ప్రేతమ్’ కి రీమేక్. ఈ మూవీ ఇక్కడ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.
10) ప్రేమమ్ :
నాగ చైతన్య నటించిన ఈ మూవీ మలయాళంలో అదే పేరుతో రీమేక్ అయిన ‘ప్రేమమ్’ కి రీమేక్. తెలుగులో ఈ మూవీ ఎబౌవ్ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.