కేవలం గ్లామర్ షోతోనే పాపులర్ అయిన హీరోయిన్లు చాలా మంది ఉంటారు. అందులో మమతా కులకర్ణి ఒకరు. ఒకప్పుడు బాలీవుడ్లో ఈ అమ్మడు చేసిన స్కిన్ షో మరో హీరోయిన్ చేయలేదు అంటే అతిశయోక్తి కాదేమో. దివ్యభారతి టాప్ లీగ్ లో కొనసాగుతున్న టైంలో ప్రమాదవశాత్తు ఆమె ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె చేయాల్సిన చాలా సినిమాల్లో మమతా కులకర్ణి (Mamta Kulkarni) తీసుకున్నారు అప్పటి ఫిలిం మేకర్స్. ఎందుకంటే ఈమె కొన్ని యాంగిల్స్ లో దివ్య భారతి లా కనిపిస్తుంది.
Mamta Kulkarni
అందుకే ఆమె పోయాక.. ఆమె చేయాల్సిన సినిమాలు అన్నీ ఈమె (Mamta Kulkarni) చేసి పాపులర్ అయిపోయింది. అటు తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా ‘డస్ట్’ అనే మ్యాగ్ జైన్ కవర్ పేజిలకి బట్టలు లేకుండా ఫోజులు ఇచ్చింది. దీంతో ఆమె కాంట్రోవర్సీల్లో ఇరుక్కున్నట్టు అయ్యింది. దీంతో ఆఫర్లు తగ్గాయి. ఈ క్రమంలో డ్రాగ్ లార్డ్ విక్కీ గోస్వామిని పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లకు ఈమె రూ.2000 కోట్ల డ్రగ్స్ స్కామ్లో అరెస్ట్ అయ్యింది.అటు తర్వాత 2010లో ఈమె సన్యాసిగా మారిపోయింది.
‘ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగిని’ అనే పేరుతో ఈమె ఓ పుస్తకం కూడా రాసింది. ఇటీవల కుంభమేళాలో ఆమె సాధ్విగా మారడం జరిగింది. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. ‘సాధ్విగా మారడం తన అదృష్టం’ అని తెలిపింది. అంతేకాకుండా ఆమె పేరు మమతానంద్ గిరి సాధ్విగా మార్చుకుంటున్నట్టు కూడా ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. తెలుగులో కూడా మమతా కులకర్ణి ‘దొంగ పోలీస్’ ‘ప్రేమ శిఖరం’ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఇక ఆమె (Mamta Kulkarni) లేటెస్ట్ లుక్ ఇప్పుడు వైరల్ అవుతుంది.