శ్రీవిష్ణు (Sree Vishnu) హీరోగా ‘సింగిల్'(#SINGLE) అనే యూత్ ఫుల్ మూవీ రూపొందింది. అల్లు అరవింద్(Allu Aravind) సమర్పణలో ‘జి ఎ 2 పిక్చర్స్’ బ్యానర్ పై బన్నీ వాస్ (Bunny Vasu), విద్యా కొప్పినీడి (Koppineedi Vidya) ఈ సినిమాను నిర్మించారు. ‘నిను వీడని నీడను నేనే’ (Ninu Veedani Needanu Nene) ‘నేనే నా’ (Nene Naa) వంటి సినిమాలు తెరకెక్కించిన కార్తీక్ రాజు ఈ సినిమాకు దర్శకుడు. శ్రీ విష్ణు సరసన కేతిక శర్మ(Ketika Sharma), ఇవాన (Ivana) హీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిషోర్ (Vennela Kishore) కూడా అత్యంత కీలక పాత్ర పోషించారు.
ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మే 9న ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని తెలియజేస్తూ మేకర్స్ నిన్న ఒక ట్రైలర్ ను కూడా నిన్న వదలడం జరిగింది. దానికి కూడా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది అని చెప్పాలి. ఈ ట్రైలర్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. అయితే ఇందులో ఉన్న 2 డైలాగుల వల్ల హీరో మంచు విష్ణు హర్ట్ అయినట్టు సమాచారం. ‘సింగిల్’ (#Single) ట్రైలర్లో 2 కామెడీ డైలాగులు ఉంటాయి.
అందులో ఒకటి ‘శివయ్యా’ అంటూ వెన్నెల కిషోర్ పలికే డైలాగ్. ఇంకోటి ‘మగాడి జీవితం మంచు కురిసి పోయింది’ అంటూ శ్రీవిష్ణు పలికే డైలాగ్. ఇవి 2 కూడా మంచు విష్ణు (Manchu Vishnu) అండ్ ఫ్యామిలీని టార్గెట్ చేసి రాసిన సెటైరికల్ డైలాగ్స్ అని అతను భావిస్తున్నాడట. దీంతో సింగిల్ ట్రైలర్ అలాగే సినిమా యూనిట్ పై తగిన యాక్షన్ తీసుకోవాలి అని అతను భావిస్తున్నట్టు సమాచారం.