కోలీవుడ్ డైరెక్టర్ అయినప్పటికీ సినిమాల ద్వారా మణిరత్నం ఇతర భాషల్లో కూడా తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. మణిరత్నం తెలుగులో దర్శకత్వం వహించిన గీతాంజలి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు దర్శకుడిగా మణిరత్నంకు మంచి పేరు తెచ్చిపెట్టింది. తమిళంలో మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు తెలుగులోకి డబ్ కావడంతో పాటు సక్సెస్ సాధించాయి. రోజా, బొంబాయి సినిమాలను ఈ తరం యువత కూడా ఇష్టపడతారనే సంగతి తెలిసిందే.
అయితే మణిరత్నం సాధారణంగా ఫ్రెంచ్ బియర్డ్ లో ఎక్కువగా కనిపిస్తారు. ఒక ఇంటర్వ్యూలో మణిరత్నంకు గడ్డంకు సంబంధించిన ప్రశ్న ఎదురు కాగా గడ్డానికి సంబంధించిన ప్రశ్న ఎదురవుతుందని తాను ఎప్పుడూ అనుకోలేదని మణిరత్నం చెప్పుకొచ్చారు. గురు సినిమా షూటింగ్ సమయంలో తాను క్లీన్ షేవ్ తో ఉండేవాడినని రావణ్ సినిమాకు పని చేస్తున్న సమయంలో లైట్ గా గడ్డం ఉండేదని మణిరత్నం అన్నారు. ఒకసారి షేవ్ చేస్తున్న సమయంలో ఫ్రెంచ్ బియర్డ్ లుక్ కు తీసుకొచ్చి ఆపేశానని ఆ సమయంలో చాలామంది తన లుక్ గురించి స్పెషల్ గా అడిగారని మణిరత్నం చెప్పుకొచ్చారు.
ఫ్రెంచ్ బియర్డ్ వల్ల మూడు నిమిషాల సమయం ఆదా అవుతుందని మణిరత్నం అన్నారు. అందరూ లుక్ బాగుందని చెప్పడంతో ఫ్రెంచ్ బియర్డ్ ను ఫాలో అవుతున్నానని మణిరత్నం పేర్కొన్నారు. సహజత్వానికి దగ్గరగా ఉండే సినిమాలను మణిరత్నం ఎక్కువగా తెరకెక్కించారు. మణిరత్నం నవరస అనే వెబ్ సిరీస్ ను నిర్మించగా తొమ్మిది మంది దర్శకుల డైరెక్షన్ లో తొమ్మిది మంది హీరోలతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఆగష్టు 6వ తేదీన ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో విడుదల కానుంది.