వరుణ్ తేజ్ ఓ హిట్టు కోసం అల్లాడుతున్నాడు. ‘గద్దలకొండ గణేష్’ తర్వాత వరుణ్ తేజ్ చేసిన ‘గని’ ‘గాండీవధారి అర్జున’ ‘ఆపరేషన్ వాలెంటైన్’ వంటి సినిమాలు పెద్ద డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి. దీంతో కచ్చితంగా హిట్టు కొట్టాలని ‘మట్కా’ చేశాడు. ఇది ఒక పీరియాడిక్ మూవీ. ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు.మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. నవంబరు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. తాజాగా ట్రైలర్ ని వదిలారు.
Matka Teaser
2 నిమిషాల నిడివి కలిగిన ‘మట్కా’ టీజర్.. ‘ఈదేశంలో చలామణీ అయ్యే ప్రతీ రూపాయిలో 90 పైసలు నూటికి ఒక్కడే సంపాదిస్తాడు. మిగతా పది పైసల కోసం 99 మంది కొట్టుకొంటారు. నువ్వు 90 పైసలు సంపాదించే ఒక్కడివి. 99 మందిలో ఒక్కడిలా మిగిలిపోకు. నీకా దమ్ముంది’ అంటూ ‘బొమ్మాళి’ రవిశంకర్ పలికే మాస్ అండ్ ఇన్స్పైరింగ్ డైలాగ్ తో టీజర్ మొదలైంది. ఆ తర్వాత ‘విశాఖపట్నం అంటే ఒకటి సముద్రం గుర్తుకు రావాలి… లేదా ఈ వాసు గుర్తుకు రావాలి’ అనే మాస్ డైలాగ్ తో హీరో వరుణ్ తేజ్ క్యారెక్టరైజేషన్ ఏంటనేది తెలియజేశారు.
ఒక మార్కెట్లో కూలీగా పనిచేసే అతను అసాధారణ వ్యక్తిగా ఎలా ఎదిగాడు? అనే పాయింట్ తో ఈ సినిమా రూపొందినట్టు తెలుస్తుంది. చివర్లో ‘ధర్మం… మనకు ఏది అవసరమో అదే ధర్మం. మనిషిలో ఆశ చావనంత వరకూ నా యాపారానికి చావు ఉండదు’ హీరో పలికే డైలాగ్ తో సినిమాలో విషయం ఉందని స్పష్టమవుతుంది.వరుణ్ తేజ్ గెటప్..లు కూడా కొత్తగా ఉన్నాయి. టీజర్ అయితే ఇంప్రెసివ్ గా ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :