నేచురల్ స్టార్ నాని మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నారు. తక్కువ బడ్జెట్ తో పూర్తికావడం.. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలను అందించడం నాని సినిమాల ట్రేడ్ మార్క్ గా మారింది. అందుకే నాని సినిమాకి డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం నాని . వేణు శ్రీరాం దర్శకత్వంలో MCA (మిడిల్ క్లాస్ అబ్బాయి) చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ దీపావళి రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంది. అలాగే రీసెంట్ గా విడుదలయిన టీజర్ యువతను ఆకర్షించింది. డిసెంబర్ మూడవ వారంలో థియేటర్లోకి రానున్న మూవీకి ఇప్పుడే బిజినెస్ జరిగిపోతోంది. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్, అన్ని ఏరియాల థియేట్రికల్ రైట్స్ కలుపుకుని 40 కోట్ల వరకు ప్రి రిలీజ్ బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాలవారు తెలిపారు.
నాని నటించిన నేను లోకల్ సినిమా 40 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. అందుకే ఇంత మొత్తం పలికిందని వెల్లడిస్తున్నారు. ఈ సినిమాకు 18 కోట్ల బడ్జెట్ పెట్టారని, ప్రచారానికి మరో 2 కోట్లు ఖర్చవుతోంది. మరి రిలీజ్‌కు ముందే 40 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగడంతో నిర్మాతకు టేబుల్ ప్రాఫిట్ గా 20 కోట్లు లభించాయి. ఈ బిజినెస్ చూసి స్టార్ హీరోలు సైతం ఆశ్చర్యపోతున్నారు. మరి రిలీజ్ తర్వాత కలక్షన్స్ తో ఇంకెంతమందిని ఆశ్చర్యపరుస్తుందో చూడాలి.