మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘విశ్వంభర’ తో (Vishwambhara) ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘బింబిసార’ (Bimbisara) దర్శకుడు మల్లిడి వశిష్ట్ (Mallidi Vasishta) తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం ప్యాచ్ వర్క్ నడుస్తుంది. అలాగే రెండు పాటల చిత్రీకరణ, వి.ఎఫ్.ఎక్స్ పనులు నడుస్తున్నాయి. ఇది పూర్తయిన వెంటనే అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో చిరు ఒక సినిమా చేస్తారు. ఇది ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’ (Shankar Dada M.B.B.S) స్టైల్లో సాగే కామెడీ అండ్ యాక్షన్ డ్రామా అని తెలుస్తుంది.
2026 సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై ఈ సినిమాని సాహు (Sahu Garapati) నిర్మిస్తారు. దీని తర్వాత చిరు ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన బాబీ కొల్లి (K. S. Ravindra) దర్శకత్వంలో ఒక సినిమా చేస్తారు. మైత్రి సంస్థ దీనిని నిర్మించనుంది. ఆ వెంటనే శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో సినిమా మొదలుపెడతారు. ఇప్పుడు మరో క్రేజీ డైరెక్టర్ స్క్రిప్ట్ కి కూడా చిరు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.
అతను మరెవరో కాదు వెంకీ అట్లూరి (Venky Atluri) . ‘సార్’ (Sir) ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) సినిమాలతో వెంకీ కూడా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. అవి రెండూ వంద కోట్ల పైనే వసూళ్లు సాధించాయి. ఇప్పుడు అతను సూర్యతో (Suriya) సినిమా చేయబోతున్నాడు. వచ్చే ఏడాది చివర్లో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తర్వాత చిరు సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెడతారు.
2026 చివర్లో లేదా 2027 ఆరంభంలో ఆ ప్రాజెక్టు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. చిరంజీవి కుమార్తె సుస్మిత (Sushmita Konidela) ఆ సినిమాకు ఓ నిర్మాతగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఎలా చూసుకున్నా చిరు 2027 వరకు యమ బిజీగా గడుపుతారని స్పష్టమవుతుంది.