ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్న సినిమా బాహుబలి కంక్లూజన్. ఈ మూవీ షూటింగ్ పూర్తిచేసుకొని ఏప్రిల్ 28 న రిలీజ్ కావడానికి ముస్తాబు అవుతోంది. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సృష్టించిన ఈ చిత్రంలో బాహుబలి, భల్లాల దేవా తర్వాత గుర్తుకు వచ్చే పేరు కట్టప్ప. ఆయన బాహుబలిని ఎందుకు చంపాడు? అనే విషయం తెలుసుకోవాలని అభిమానులు ఏడాదిగా ఎదురుచూస్తున్నారు. మనదేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మాత్రం మహిష్మతి రాజ్యాన్ని కాపాడే వ్యక్తిగా కట్టప్ప గుర్తిండి పోయారు. ఆ విషయాన్నీ అందరి ముందు చెప్పి బాహుబలికి మరింత క్రేజ్ పెంచారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాహుబలి ప్రస్తావన తీసుకొచ్చారు.
“బాహుబలి సినిమాలో కట్టప్ప మహిష్మతి సామ్రాజ్యాన్ని కంటికి రెప్పలా కాపాడినట్లు ఉత్తరప్రదేశ్ ని బీజేపీ కాపాడుతుంది” అని చెప్పారు. ఇరవై కోట్ల ప్రజలు కలిగిన ఉత్తరప్రదేశ్ వంటి అతిపెద్ద రాష్ట్రంలో ప్రధానమంత్రి బాహుబలి సినిమా గురించి చెప్పడం.. ఆ చిత్రానికి ప్లస్ అయింది. సినిమాలు గురించి పెద్దగా ఆసక్తి చూపించని రాజకీయ నాయకులకు కూడా ఈ చిత్రం గురించి చర్చించుకునేలా మోదీ చేశారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.