వర్షాకాలం సినిమాల లిస్ట్‌ ఇదే.. ఏమవుతాయో!

టాలీవుడ్‌లో సినిమాలు అంటే ఒకప్పుడు సీజన్‌ బట్టి ఉండేవి. సంక్రాంతి, వేసవి, దసరా అంటూ సీజన్‌ పెట్టుకుని పెద్ద హీరోల సినిమాలు, కుర్ర స్టార్ల సినిమాలు వచ్చేవి. అయితే ఇటీవల కాలంలో సీజన్‌తో సంబంధం లేకుండా టైమ్‌ ఎప్పుడుంటే అప్పుడే వచ్చేస్తున్నాయి. అలా రానున్న వర్షా కాలం టాలీవుడ్‌లో సినిమాల సందడి మామూలుగా ఉండటం లేదు. కుర్ర హీరోలంతా తమ సినిమాలనే మెరుపులు, ఉరుముల్ని సిద్ధం చేస్తున్నారు. అవేంటో, వాటి లెక్కేంటో చూసేద్దాం.

వేసవి వినోదం క్లైమాక్స్‌కు వచ్చేసింది . వెంకటేశ్ – వరుణ్‌తేజ్‌– అనిల్‌ రావిపూడి ‘ఎఫ్‌3’తో ఈ సమ్మర్‌ సీజన్‌కు ముగింపు ఇస్తారు. ఆ తర్వాత వర్షాకాలం మూడు నెలల్లో చాలా క్రేజీ సినిమాల ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాయి. నెలల వారీగా సినిమాల సంగతి చూసుకుంటే జూన్‌లో ఆరు చిత్రాలు పలకరించనున్నాయి. జులైలో డజను సినిమాలు థియేటర్లకు రానున్నాయి. ఆగస్టు సుమారు ఆరు సినిమాలు విడుదల అయ్యే అవకాశం ఉంది. జూన్‌ నెల 3న కమల్‌హాసన్‌ – ఫహాద్‌ ఫాజిల్‌ – విజయ్‌ సేతుపలిల ‘విక్రమ్‌’ రాబోతోంది.

యాక్షన్‌ సినిమాల ప్రియులకు ఈ సినిమా ఫీస్ట్‌ అంటున్నారు. దీంతోపాటు అడివి శేష్‌ ‘మేజర్‌’ బాక్సాఫీస్‌ ముందు సందడి చేయబోతోంది. దీనికి హీరో మహేష్‌బాబు నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. జూన్‌ 10న నాని ‘అంటే.. సుందరానికి’ తీసుకొస్తున్నారు. జూన్‌ 17న రవితేజ ‘రామారావు ఆన్‌ డ్యూటీ’తో డ్యూటీ ఎక్కనున్నాడు. అలాగే సత్యదేవ్‌ ‘గాడ్సే’తో రాబోతున్నాడు. అలాగే 24న కిరణ్‌ అబ్బవరం ‘సమ్మతమే’ వస్తోంది. జులైలో ఒకటో తేదీ నుండి సందడి షురూ అవుతోంది. 1న గోపీచంద్‌ – మారుతి ‘పక్కా కమర్షియల్‌’ ఖాతా తెరుస్తుంది.

చాలా రోజుల నుండి వాయిదా పడుతూ వస్తున్న రానా – సాయిపల్లవి ‘విరాటపర్వం’ అదే రోజు తెస్తున్నారు. ఇక వైష్ణవ్‌ తేజ్‌ మూడో సినిమా ‘రంగ రంగ వైభవంగా’ కూడా అదే రోజు వస్తుంది. నాగచైతన్య – విక్రమ్‌ కె.కుమార్‌ ‘థ్యాంక్‌ యూ’ను జులై 8న విడుదల చేస్తారట. రామ్‌ — లింగుస్వామి మాస్‌ యాక్షన్‌ ‘ది వారియర్‌’ను జులై 14న తెలుగు, తమిళంలో విడుదల చేస్తారు. ఇక జులై 15న ‘హ్యాపీ బర్త్‌డే’తో థియేటర్లలో సందడి చేయనుంది లావణ్య త్రిపాఠి. అలాగే ‘కార్తికేయ 2’తో నిఖిల్ జులై 22న వస్తాడు.

కిచ్చా సుదీప్‌ ‘విక్రాంత్‌ రోణ’ సందడి 28న ఉండబోతోంది. ఈ పాన్‌ ఇండియా సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. 29న అడివి శేష్‌ మరోసారి సందడి చేయబోతున్నాడు. ‘హిట్’ సీక్వెల్‌ ‘హిట్‌2’ను అదే రోజు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు నిర్మాత నాని. ఆగస్ట్‌లో పాన్‌ ఇండియా చిత్రాల సందడి ఉంటుంది. కల్యాణ్‌ రామ్‌ నటించిన ‘బింబిసార’ ఆగస్ట్‌ 5న తీసుకొస్తున్నారు. ఆగస్ట్‌ 12న సమంత తొలి పాన్‌ ఇండియా ప్రాజెక్టు ‘యశోద’ రిలీజ్‌ చేస్తున్నారు.

అఖిల్‌ – సురేందర్‌ రెడ్డి స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా ‘ఏజెంట్‌’ను తీసుకొస్తామని ఇప్పటికే ప్రకటించారు. నితిన్‌ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘మాచర్ల నియోజకవర్గం’ కూడా అదే రోజున విడుదల చేయాలని నిర్ణయించారు. అలాగే ఆగస్ట్‌ 25న ‘లైగర్‌’గా విజయ్‌ దేవరకొండని బాక్సాఫీస్‌ ముందుకు తీసుకొస్తున్నారు పూరి జగన్నాథ్‌. అయితే ఆగస్టు 11న చిరంజీవి ‘గాడ్‌ఫాదర్‌’ వస్తుంది అంటున్నారు. ఆ సినిమా మీద క్లారిటీ వస్తే రెండో వారం సినిమాల డేట్స్‌ మారే అవకాశం ఉంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Share.