మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘మోసగాళ్లు’. జెఫ్రీ గీ చిన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 19న విడుదల అయ్యింది. అయితే థియేటర్లలో ఈ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.మొదటి నుండీ ఈ సినిమాకి ప్రమోషన్లు బాగానే చేసినా.. టీజర్, ట్రైలర్ లకు మంచి స్పందన లభించినా.. మినిమమ్ ఓపెనింగ్స్ ను కూడా సాధించలేకపోయింది ఈ చిత్రం.పోనీ ఓటిటిలో అయినా ఈ చిత్రం బాగా పెర్ఫార్మ్ చేస్తుంది అనుకుంటే..
ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ఇండియాలో జరిగిన అతిపెద్ద ఐటీ స్కామ్ ను ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ రకంగానూ రంజింప చేయలేకపోయింది.విష్ణు,కాజల్ తో పాటు నవదీప్, నవీన్‌చంద్ర, సునీల్‌శెట్టి వంటి క్రేజీ ఆర్టిస్ట్ లు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. మార్చి 16న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటిటి లో విడుదలయ్యింది. కానీ ఈ చిత్రానికి వ్యూయర్ షిప్ ఏమాత్రం బాలేదని సమాచారం.
ఈ మధ్య కాలంలో థియేటర్లలో ఫ్లాప్ అయిన సినిమాలు ఓటిటిలో పర్వాలేదు అనిపించాయి. అయితే ‘మోసగాళ్లు’ చిత్రాన్ని మాత్రం జనాలు పట్టించుకోలేదు. దీనికి కారణాలు ఏంటా? అని ఆరాతీస్తే..’హీరో విష్ణు ప్లాపుల్లో ఉండడం, థియేట్రికల్ పరంగా ఈ చిత్రం డిజాస్టర్ కావడం, లేట్ గా ఓటిటిలో విడుదలవ్వడం’.. అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ చిత్రానికి ప్రఖ్యాత ఐ.ఎం.డి.బి లో 7.7/10 రేటింగ్ నమోదైనా ఉపయోగం లేకపోయింది.