“సరైనోడు” టైమ్ లోనే బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తానని అల్లు అరవింద్ ప్రకటించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మాణమవ్వాల్సిన ఈ సినిమాని రామ్ చరణ్ తనకు దానయ్య మీద ఉన్న అభిమానంతో “డివివి క్రియేషన్స్”కు మళ్లించాడు. మాస్ ఆడియన్స్ లో బోయపాటికి ఉన్న క్రేజ్, హీరోను ఆయన తన టేకింగ్ టెక్నిక్స్ తో ఎలివేట్ చేసే విధానం దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను దానయ్య నిర్మిస్తే “బ్రూస్ లీ” నష్టాలు కవర్ అవ్వడంతోపాటు.. మంచి లాభాలు కూడా చవిచూసే అవకాశాలు పుష్కలంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే.. డిసెంబర్ నుండి ఈ సినిమా సెట్స్ కు వెళుతుందని.. 2018 దసరా కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నారని వినికిడి. అయితే.. ఈ చిత్ర ప్రారంభోత్సవం డిసెంబర్ 2వ తారీఖున హైద్రాబాద్ లోని డి.వి.వి.దానయ్య ఆఫీస్ లో చోటు చేసుకోనుందని తెలుస్తోంది. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూట్ మొదలవుతుందట. ఈ చిత్రంలో కథానాయికగా ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపిస్తున్నప్పటికీ.. చివరి నిమిషంలో మారే అవకాశం ఉందని సమాచారం.
ఇకపోతే.. “రంగస్థలం” చివరి షెడ్యూల్ ప్రస్తుతం హైద్రాబాద్ లోని సెట్ లో జరుగుతోంది. పూజా హెగ్డేపై ఓ పాట చిత్రీకరిస్తున్నారు. మార్చి నెలాఖరుకు చిత్రాన్ని విడుదల చేయాలని ప్లానింగ్ లో ఉంది చిత్ర బృందం.