ఈ వారం కూడా అరడజను పైనే సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. అందులో ‘ముఖ్య గమనిక’ అనే సినిమా కూడా ఒకటి. అల్లు అర్జున్ బావమరిది.. అంటే అల్లు అర్జున్ కి మేనమామ కొడుకు అయినటువంటి విరాన్ ముత్తంశెట్టి.. ఈ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. టీజర్, ట్రైలర్ వచ్చినట్టు కూడా జనాలకి తెలీదు. కానీ అల్లు అర్జున్ పేరు చెప్పి విరాన్ ని సోషల్ మీడియాలో కొంచెం ఎక్కువగానే ప్రమోట్ చేశారు. మరి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ‘ముఖ్య గమనిక’ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి :
కథ : విరాన్(విరాన్ ముత్తంశెట్టి) ఓ పోలీస్ ఆఫీసర్ కొడుకు. ఊహించని విధంగా అతని తండ్రి హత్యకు గురవుతాడు. దీంతో తండ్రి ఉద్యోగం విరాన్ కి వస్తుంది. అయితే విరాన్ తండ్రి మాత్రమే కాదు ఇంకా చాలా మంది పోలీసులు ఊహించని విధంగా హత్యకి గురవుతూ ఉంటారు. దీని వెనుక ఉన్న మిస్టరీని చేధించాలని విరాన్ డిసైడ్ అవుతాడు. ఈ క్రమంలో అతనికి తన తండ్రి చనిపోయిన రోజునే మిస్ అయిన ఓ ఆర్.జె.కేసు ఎదురవుతుంది.
అతను ఎలా మిస్ అయ్యాడు? దాని వెనుక అతని భార్య హస్తం ఉందా? అసలు ఆర్.జె మిస్సింగ్ కేసుకి విరాన్ తండ్రి హత్యకి సంబంధం ఏంటి? చివరికి విరాన్ ఆ మర్డర్స్ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించి హంతకుడిని పట్టుకున్నాడా? లేదా? అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు : హీరో విరాన్ మంచి సబ్జెక్ట్ అయితే ఎంపిక చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. కానీ నటుడిగా మాత్రం మెప్పించలేకపోయాడు. డాన్సులు చేసే స్కోప్ దక్కలేదు. డైలాగ్ డెలివరీ కూడా పేలవంగా ఉంది. మొదటి సినిమా అయినప్పటికీ కొద్దో గొప్పో పెర్ఫార్మన్స్ ఇచ్చినా పాస్ మార్కులు పడిపోతాయి. కానీ అతనికి పెద్దగా నటించే స్కోప్ దక్కలేదు. ఇంకో విషయం ఏంటంటే.. అసలు ఈ సినిమాలో హీరో విరాన్ కి స్క్రీన్ స్పేస్ కూడా ఎక్కువ దొరకలేదు.
హీరోయిన్ లావణ్య సాహుకారకి కూడా అంతే..! ఎక్కువ శాతం ఆర్.జె.రోల్ చేసిన నటుడికి, అతని భార్యగా చేసిన ఆర్యన్ ఇప్పిల్లి కి దక్కింది. వాళ్ళు కూడా తమ పెర్ఫార్మన్స్ తో ఇంప్రెస్ చేసింది అయితే ఏమీ లేదు. సినిమాలో ప్రేక్షకులకి తెలిసిన మొహాలు ఏమీ లేవు అనడంలో అతిశయోక్తి లేదు.పోనీ వాళ్ళ పెర్ఫార్మన్స్ అయినా ఇంపాక్ట్ ఫుల్ గా ఉందా అంటే అదీ లేదు.
సాంకేతిక నిపుణుల పనితీరు : ఒక లైన్ గా చెప్పుకోవాలి అంటే ‘ముఖ్య గమనిక’ కథ బాగానే ఉందే అనిపిస్తుంది. కానీ దర్శకుడు వేణు మురళీధర్.వి తన టేకింగ్ తో ఏమాత్రం మెప్పించలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ లో చాలా ల్యాగ్ ఉంది. సెకండ్ హాఫ్ కొంత వరకు పర్వాలేదు అనిపించినా పెద్దగా గ్రిప్పింగ్ గా అయితే ఉండదు. దర్శకుడు ఏం చెప్పాలి అనుకున్నాడో ఆ పాయింట్ చెప్పాడు.. కానీ ఆసక్తికరంగా కథనాన్ని నడిపించలేకపోవడం పెద్ద మైనస్ అని చెప్పాలి. వేణు మురళీధర్.వి సినిమాటోగ్రఫీ కూడా పెద్దగా ఇంప్రెస్ చేసే విధంగా లేదు.
సంగీతం కూడా అంతే..! ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ గా ఏమీ లేవు. తక్కువ బడ్జెట్లో ఒక ప్లేస్లోనే చిత్రీకరణ మొత్తం పూర్తి చేసినట్లు ఉన్నారు. అది క్లియర్ గా తెలిసిపోతుంది. డబ్బింగ్ లోపాలు కూడా చాలానే ఉన్నాయి. రన్ టైం 2 గంటల 5 నిమిషాలు మాత్రమే ఉండటం ఒక ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాలి.
విశ్లేషణ : ఆసక్తికరమైన కథనం, మంచి నటీనటులు లేనప్పుడు ఎంత మంచి కథ అయినా ప్రేక్షకులను మెప్పించి పాసవ్వడం కష్టం అని ‘ముఖ్య గమనిక’ (Mukhya Gamanika) తో మరోసారి ప్రూవ్ అయ్యింది.
రేటింగ్ : 1.5/5
Rating
1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus