ఈ సూపర్ స్టార్ తర్వాత మురుగ సినిమా ఆ సూపర్ స్టార్ తో…
- August 23, 2017 / 08:11 AM ISTByFilmy Focus
స్టార్ హీరోలకు సూపర్ హిట్ లు ఇవ్వడమే కాదు.. తన సినిమాల ద్వారా మంచి మెసేజ్ లు ఇచ్చే దర్శకుడు మురుగదాస్. ఆయన తీసే సినిమాల్లో హాలీవుడ్ ఇన్స్పిరేషన్ ఎక్కువగా కనిపించినా.. సమాజం పట్ల, దేశం పట్ల ఆయనకి ఉన్న అభిమానం కూడా అదే స్థాయిలో కనిపిస్తుంటుంది. మహేష్ బాబుతో “స్పైడర్” చిత్రాన్ని తెరకెక్కిస్తున్న మురుగదాస్ ప్రస్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటూనే.. ప్రమోషన్స్ లోనూ పాలుపంచుకొంటున్నాడు. ఈ సినిమా తర్వాత మురుగదాస్ సినిమా ఎంటనే విషయంపై పెద్దగా బజ్ కూడా లేదు.
కానీ.. ఉన్నట్లుండి మురుగదాస్ పెద్ద బాంబ్ పేల్చాడు. అందరూ మురుగదాస్ నెక్స్ట్ సినిమా విజయ్ తో ఉంటుందిలే అని ఫిక్స్ అయిపోయిన తరుణంలో.. “నా నెక్స్ట్ సినిమా రజనీకాంత్”తో అంటూ మురుగదాస్ ఓ గంట క్రితం ఇచ్చిన స్టేట్ మెంట్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హల్ చల్ చేస్తుంది. ఇప్పటికే స్టోరీ డిస్కషన్స్ కూడా అయిపోయాయని.. రజనీ నటిస్తున్న “రోబో 2, కాలా” చిత్రాల షూటింగ్ పూర్తవ్వగానే తన దర్శకత్వంలో రజనీ నటించబోయే సినిమా మొదలవుతుందని చెప్పాడు మురుగదాస్. తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబుతో “స్పైడర్” అనంతరం ఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ను మురుగదాస్ డైరెక్ట్ చేయనుండడం మామూలు విషయం కాదు. బహుశా ఇందుకేనేమో.. “స్పైడర్” తమిళ ఆడియో విడుదల వేడుకకు రజనీకాంత్ ముఖ్య అతిధిగా విచ్చేయనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














