టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు ప్రభాస్ ఒకరు. బాహుబలి సినిమా ద్వారా ఈయన పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా హీరోగా ఎంతో మంచి సక్సెస్అం దుకున్నటువంటి ఈయన ప్రస్తుతం అన్ని కూడా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ప్రభాస్ మైనపు విగ్రహాన్ని తాజాగా మైసూర్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే.
ఈ మైనపు విగ్రహాన్ని ప్రభాస్ (Prabhas) నటించిన బాహుబలి సినిమాలో అమరేంద్ర బాహుబలి రూపంలో నిర్మించారు. అయితే ఈ విగ్రహాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ప్రభాస్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విగ్రహాన్ని కనుక ఏర్పాటు చేస్తే కచ్చితంగా ప్రభాస్ ని అవమానించినట్లేనని నిర్వాహకులపై అభిమానులు మండిపడ్డారు. ఇలా ప్రభాస్ మైనపు విగ్రహంపై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ కూడా స్పందించి ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఏ విధమైనటువంటి అధికారక లైసెన్స్ పొందలేదు.
అందుకే ఈ విగ్రహాన్ని వెంటనే తొలగించాలి లేకపోతే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాము అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ విగ్రహం పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇలా ప్రభాస్ విగ్రహంపై నిర్మాత అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మ్యూజియం నిర్వాహకులు స్పందిస్తూ..
ఎవరి మనోభావాలు దెబ్బతీయాలన్న ఉద్దేశంతో మేము ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదని తెలిపారు. అలాగే ఈ విగ్రహం పై నిర్మాత కొన్ని అభ్యంతరాలు చెప్పడంతో ఈ విగ్రహాన్ని తొలగిస్తున్నాము అంటూ ఈ సందర్భంగా మ్యూజియం నిర్వహకులు ఈ విగ్రహాన్ని తొలగించడం పై క్లారిటీ ఇచ్చారు.