తిరుమల లడ్డూ వివాదం విషయంలో సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. నాగబాబు (Naga Babu) సైతం ఈ వివాదం గురించి తాజాగా రియాక్ట్ అయ్యారు. టీటీడీ లడ్డూ ప్రసాదాన్ని జంతువుల కొవ్వు, చేప నూనెతో కల్తీ చేసి కోట్ల సంఖ్యలో హిందువుల మనోభావాలతో ఆడుకోవడం క్షమించరాని నేరం అని నాగబాబు రియాక్ట్ అయ్యారు. తిరుమల ప్రపంచ ప్రఖ్యాతి గల పుణ్యక్షేత్రం అని ఆ క్షేత్రం ప్రసాదంలో నాలుగు రాళ్లు మిగుల్చుకోవాలనే దురుద్దేశంతో జంతువుల కొవ్వు సైతం వెయ్యడానికి వెనుకాడని వాళ్లను క్షమించకూడదని నాగబాబు తెలిపారు.
మరోవైపు ఈ వివాదం అంతకంతకూ పెద్దదవుతూ ఉండటంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగడం గమనార్హం. ఈ వివాదం కోట్ల సంఖ్యలో భక్తుల మనోభావాలకు సంబంధించినది కావడంతో ఈ అంశం గురించి ప్రభుత్వం తీవ్రంగా రియాక్ట్ అయింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈ వివాదానికి సంబంధించిన పూర్తి నివేదికను తనకు పంపాలని కోరినట్టు సమాచారం అందుతోంది.
జేపీ నడ్డా ఆహార భద్రతా ప్రమాణాల అథారిటీ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం సైతం నివేదికను పంపడానికి సిద్ధమవుతోంది. నాగబాబు సోషల్ మీడియా వేదికగా ఒకింత ఘాటుగా రియాక్ట్ కావడం హాట్ టాపిక్ అవుతోంది. నాగబాబు ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తిరుమల లడ్డూ వివాదంలో ఆరోపణలు నిజమని ప్రూవ్ అయితే దోషులను కఠినంగా శిక్షించాలనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
తిరుమల లడ్డూ వివాదంలో రాజకీయ ఆరోపణలు మానివేసి తప్పు నిజంగా జరిగిందో లేదో గుర్తించాల్సి ఉంది. నాగబాబు సైతం తెలుగు రాష్ట్రాల్లోని కీలక ఘటనల గురించి స్పందిస్తూ తన అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరుస్తున్నారు. నాగబాబు సినిమాలతో మళ్లీ బిజీ కావాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నాగబాబు కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.