“కౌన్ బానేగా కరోడ్ పతి” తర్వాత ప్రపంచం మొత్తం పాపులారిటీ సంపాదించుకున్న ఏకైక షో “బిగ్ బాస్”. ప్రపంచంలోని అన్నీ ప్రాధమిక భాషల్లోనూ రూపొందే ఈ షో టీయార్పీ రేటింగ్స్ చూస్తే ఎవ్వరైనా విస్తుబోవాల్సిందే. తెలుగులో ఆల్రెడీ మూడు సక్సెస్ ఫుల్ సీజన్లు పూర్తిచేసుకున్న బిగ్ బాస్ వచ్చే నెల నుండి నాలుగో సీజన్ కు రెడీ అవుతోంది. కరోనా, లాక్ డౌన్ కారణంగా ఇప్పటికిప్పుడు వేరే హోస్ట్ ను వెతుక్కోలేక సీజన్ 3 కి హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జుననే నాలుగో సీజన్ కు కూడా హోస్ట్ గా కంటిన్యూ చేస్తోంది బిగ్ బాస్ టీం.
కంటెస్టెంట్స్ ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ కానీ.. నాగార్జున హోస్ట్ అనేది మాత్రం కన్ఫర్మ్. అయితే.. ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించడానికి నాగార్జున బిగ్ బాస్ టీంకి కొన్ని రూల్స్ పెట్టారట. ఇదివరకు వారానికి రెండు ఎపిసోడ్స్ హోస్ట్ చేసే నాగ్ ఇప్పుడు కేవలం ఒక్క ఎపిసోడ్ మాత్రమే హోస్ట్ చేయనున్నారు. అలాగే.. కంటెస్టెంట్స్ తో ఇదివరకటిలా హగ్గులు ఉండవు, వాళ్ళు వచ్చి తమని తాము ఇంట్రడ్యూస్ చేసుకొని హౌస్ లోకి వెళ్లిపోతారు.
అలాగే.. హోస్టింగ్ కోసం స్టేజ్ కాకుండా నాగ్ ఒక సపరేట్ రూమ్ అడిగారట. ఆ రూమ్ లో నుండే బిగ్ బాస్ తరహాలో షోను హోస్ట్ చేస్తారట నాగ్. సాధారణంగా అయితే ఇన్ని రూల్స్ కి బిగ్ బాస్ టీం ఒప్పుకొనేది కాదేమో కానీ.. వాళ్ళకి వేరే ఆప్షన్ లేకపోవడంతో నాగ్ పెట్టిన అన్నీ కండిషన్స్ కి సరేనన్నారట. చూద్దాం మరి ఈ సీజన్ బిగ్ బాస్ ఎలా ఉండబోతుందో.