సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అధినేత సూర్యదేవర నాగు వంశీ తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన సినిమాల గురించి వరుస అప్డేట్స్ విడుదల చేశారు. క్రికెట్ వరల్డ్ కప్ ఉన్నటువంటి నేపథ్యంలో తన బ్యానర్ లో నవంబర్ 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సినటువంటి ఆదికేశవ సినిమా వాయిదా వేస్తున్నట్లు ఈ సందర్భంగా ఈయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికారకంగా ప్రకటించారు.
శ్రీ లీల వైష్ణవ్ తేజ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా నవంబర్ 10వ తేదీ విడుదల కావాల్సి ఉండగా ఈ సినిమాని నవంబర్ 24వ తేదీకి వాయిదా వేశారు. ఇక ఈ మీడియా సమావేశంలో భాగంగా ఈయన గుంటూరు కారం సినిమా గురించి కూడా మాట్లాడారు. ఇకపోతే లియో సినిమా కలెక్షన్ల గురించి కూడా ఈయనకు ప్రశ్న ఎదురయింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించిన లియో సినిమా తెలుగు హక్కులను నాగ వంశీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈ సినిమాని తెలుగు వెర్షన్ లో విడుదల చేయటం వల్ల లాభాలు వచ్చాయా అంటూ ఈయనకు ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు నాగ వంశీ సమాధానం చెబుతూ లియో సినిమా కలెక్షన్స్ వల్ల తాను బాగా లాభం తీసుకున్నానని ఈ సినిమా కారణంగా తనతో పాటు డిస్ట్రిబ్యూటర్లు కూడా చాలా హ్యాపీగా ఉన్నారని ఈయన (Nagavamsi) తెలియజేశారు అయితే ఈ సినిమా సెకండ్ హాఫ్ లో కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి.
కంటెంట్ మనకి సంబంధం లేదు. మనం తీసిన సినిమా కాదు. కాంబినేషన్‍ను నమ్మి మేం హక్కులను తీసుకున్నాం. అయితే ఈ సినిమా సెకండ్ హాఫ్ లో కొన్ని కంప్లైంట్స్ ఉన్నప్పటికీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అంటూ ఈ సందర్భంగా నాగ వంశీ ఈ సినిమా విషయంలో తాను హ్యాపీగానే ఉన్నాను అంటూ తెలియజేశారు. లియో సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు సుమారు రూ.40కోట్ల మేర గ్రాస్ కలెక్షన్లను సాధించినట్టు తెలుస్తోంది.