Balakrishna: ఇక్కడ మడికట్టుకుని కూర్చోవాలా: బాలకృష్ణ

బాలకృష్ణ చాలా సరదాగా ఉంటాడు అని అతనితో పని చేసినవాళ్లు చెబుతూ ఉంటారు. అయితే అదెంత సరదా అనేది మాత్రం ‘అన్‌స్టాపబుల్‌’ షో వచ్చాకనే బయటి జనాలకు తెలిసింది. షోకు వస్తున్న గెస్ట్‌లు, షోను లైవ్‌లో చూస్తున్న ఫ్యాన్స్‌తో బాలయ్య చేస్తున్న సందడి మామూలుగా ఉండటం లేదు. రానా మాట్లలో చెప్పాలంటే ‘ఈ షోతో మేమంతా ఎంజాయ్‌ చేస్తున్నామో పక్కన పెడితే… ఫ్యాన్స్‌ మాత్రం భలేగా ఎంజాయ్‌ చేస్తున్నారు’ అనొచ్చు. తాజా ఎపిసోడ్‌లా కూడా బాలయ్య అంతే సందడి చేశాడు.

పూరి జగన్నాథ్‌, ఛార్మి, విజయ్‌ దేవరకొండ ఈ ఎపిసోడ్‌లో వచ్చి అలరించారు. ఈ సందర్భంగా బాలయ్య చేసిన సందడి మామూలుగా లేదంతే. పూరితో ‘పైసా వసూల్‌’ ముచ్చట్లు, ఛార్మితో ‘అల్లరి పిడుగు’ సంగతులు భలేగా మాట్లాడుకున్నారు. ఇక విజయ్‌ దేవరకొండ దగ్గరకు వచ్చేసరికి ఆ ఏజ్‌కి మారిపోయాడు బాలయ్య. విజయ్‌ సినిమాల గురించి బాలయ్య మాట్లాడిన విధానం సూపర్‌ అంతే. దాంతోపాటు విజయ్‌తో కిక్‌ బాక్సింగ్‌ ఆట కూడా ఆడించాడు. అప్పుడే సెట్‌లో చిన్న సరదా జరిగింది.

విజయ్‌ దేవరకొండ కిక్‌ పవర్‌ తెలిసేలా… ఓ గేమ్‌ ఏర్పాటు చేసింది టీమ్‌. శాండ్‌ బాగ్‌ను ఓ హ్యాంగర్‌కు తగిలించి, ఒక్క కిక్‌ కి అది అవతలి వైపునకు వెళ్లాలి అన్నారు. అనుకున్నట్లుగానే విజయ్‌ గట్టిగా ఒక కిక్‌ ఇచ్చారు. ఆ పవర్‌కి బ్యాగు ఆ చివరకు వెళ్లి అదే ఫోర్స్‌లో సెంటర్‌కి వచ్చేసింది. దీంతో బాలయ్య విజయ్‌ని ఓ ప్రశ్న అడిగాడు. అదే ‘నా మొదటి సినిమా పేరేంటి?’ అని. దానికి విజయ్‌ దేవరకొండ ఆలోచనలో పడ్డాడు.

సరిగ్గా అదే సమయంలో షోకు వచ్చిన అభిమానుల్లో ఒకరు ‘‘తాతమ్మకల’ అని సమాధానం చెప్పాడు. దీంతో ‘‘వాడు నా చేతిలో అయిపోయాడు ఖతం’’ అంటూ సరదాగా వార్నింగ్‌ ఇచ్చారు. అంతకుముందు బాలయ్య మాట్లాడుతూ.. ‘టాక్‌ షో అనగానే మడి కట్టుకుని కూర్చోవడం కుదరదు. నాలుగు ప్రశ్నలు అడిగి అవతలి వ్యక్తి తెలివిగా జవాబులు చెబితే వినటం నా వల్ల కాదు. అందుకే ఒక షరతు పెట్టాను. వచ్చిన వాళ్లను ఒక ఆట ఆడుకుంటానని చెప్పా’’ అంటూ నవ్వేశారు బాలయ్య.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Share.