నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో ‘దసరా’ (Dasara) అనే సినిమా వచ్చింది. రెండేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. నాని కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇక ఇదే కాంబినేషన్లో ‘ది పారడైజ్’ (The Paradise) అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘దసరా’ నిర్మాత సుధాకర్ చెరుకూరినే (Sudhakar Cherukuri) ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా జోనర్ ను తెలుపుతూ ఓ గ్లింప్స్ వదిలారు.
దానికి ప్రేక్షకుల నుండి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇది చాలా వయొలెన్స్ తో కూడుకున్న సినిమా అని నాని ముందు నుండి చెబుతూనే ఉన్నాడు. గ్లింప్స్ తో దాని డోస్ ఎంతనేది చెప్పుకొచ్చారు. దీనికి అనిరుధ్ (Anirudh Ravichander) అందించిన బీజీఎం కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ సినిమా కోసం సంగీత దర్శకుడు అనిరుధ్ అత్యధికంగా రూ.15 కోట్లు పారితోషికం అందుకున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
మరోపక్క ఈ సినిమా ఆడియో రైట్స్ ను ‘సారెగమప’ సంస్థ రూ.18 కోట్లకు దక్కించుకుంది. ఇదిలా ఉంటే.. 2026 మార్చి 26న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు గ్లింప్స్ ద్వారా స్పష్టం చేశారు. కానీ షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. వాస్తవానికి జూన్ మొదటి వారం నుండి షూటింగ్ మొదలు కావాలి.
కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు వెనక్కి వెళ్లినట్లు స్పష్టమవుతుంది. జూలై నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందట. ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ తో సెట్స్ నిర్మిస్తున్నారు. వాతావరణం వల్ల ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యి షూటింగ్ డిస్టర్బ్ అవ్వకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.