పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మూడ్ సినిమాలపైకి షిఫ్ట్ అయ్యింది. పొలిటికల్ గా బిజీగా ఉన్నప్పటికీ.. తాను కంప్లీట్ చేయాల్సిన సినిమాల విషయంలో ఆయన బాధ్యత వహిస్తున్నారు. చకచకా షూటింగ్లు ఫినిష్ చేసే పనిలో పడ్డారు. ఆల్రెడీ ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) బ్యాలెన్స్ షూటింగ్ ను పూర్తిచేశారు. వెంటనే ‘ఓజి’ (OG Movie) షూటింగ్ కి షిఫ్ట్ అయ్యారు. ఇటీవల ఓ కీలక షెడ్యూల్ ను కూడా ఫినిష్ చేయడం జరిగింది. తదుపరి షెడ్యూల్ కోసం పవన్ ముంబై వెళ్లాల్సి ఉంది.
అయితే ఇప్పుడు పవన్ ముంబై వెళ్లే పనులు పెట్టుకోవడం లేదట. దర్శకుడు సుజిత్ (Sujeeth) అక్కడ ఒక సాంగ్ ను ప్లాన్ చేశారు. అందులో పవన్ కూడా కనిపించాల్సి ఉంది. కానీ ఇప్పుడు పవన్ హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో దర్శకుడు సుజిత్.. మిగతా తారాగణంపై ఆ సాంగ్ చిత్రీకరించి.. అవసరం అనుకుంటే తర్వాత సెట్స్ వేసి పవన్ క్లోజప్స్ తీసుకోవాలని భావిస్తున్నారట. ముంబైలో 10 రోజుల పాటు షెడ్యూల్ నడుస్తుంది.
తర్వాత తాడేపల్లిలో ఓ సెట్ వేసి యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తారని టాక్ వినిపిస్తుంది. దీంతో ‘ఓజి’ కి షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేస్తారు. సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ నెలాఖరులో ‘ఓజి’ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. లేదు అంటే అక్టోబర్ లో రిలీజ్ చేస్తారు. ఈ సినిమా టీజర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అందరికీ తెలుసు. అందువల్ల సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.