Netflix: ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్ హవా తగ్గుతోందా.. ఫ్యాన్స్ ఫైర్!
- January 30, 2026 / 11:29 PM ISTByFilmy Focus Writer
ఇండియన్ ఓటీటీ మార్కెట్‌లో నెట్‌ఫ్లిక్స్ అంటే ఒకప్పుడు క్వాలిటీకి కేరాఫ్ అడ్రస్. పెద్ద పెద్ద సినిమాలను భారీ రేటుకు కొని, డిజిటల్ ప్రీమియర్ చేయడంలో నెట్‌ఫ్లిక్స్ ఎప్పుడూ ముందే ఉంటుంది. అయితే తాజాగా అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం, నెట్‌ఫ్లిక్స్ తన పట్టు కోల్పోతోందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఓటీటీలో తీసుకురావడంలో ఈ ప్లాట్‌ఫామ్ విఫలమవుతోందని ఆడియన్స్ మండిపడుతున్నారు.
Netflix
రీసెంట్‌గా విడుదలైన ‘ధురంధర్’ సినిమా విషయంలో నెట్‌ఫ్లిక్స్ తీరుపై నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లో విజువల్ వండర్‌గా అనిపించిన ఈ సినిమా, ఓటీటీలోకి వచ్చేసరికి చాలా డల్‌గా ఉందనే విమర్శలు వస్తున్నాయి. కలర్ గ్రేడింగ్ సరిగ్గా లేకపోవడం, విజువల్ ఎనర్జీ మిస్ అవ్వడం వల్ల సినిమా ఇంపాక్ట్ తగ్గిపోయిందని చాలామంది కామెంట్ చేస్తున్నారు. థియేటర్లో ఉన్న రిచ్‌నెస్ ఓటీటీ వెర్షన్‌లో కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి ఫిర్యాదులు రావడం నెట్‌ఫ్లిక్స్‌కు ఇదేం మొదటిసారి కాదు. గతంలో రణబీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ సమయంలో కూడా ఇలాంటి చర్చలే జరిగాయి. థియేట్రికల్ కట్‌లో ఉన్న ఆ రానెస్ ఇంటెన్సిటీ, డిజిటల్ వెర్షన్‌లో మిస్ అయిందని అప్పట్లో ఫ్యాన్స్ గోల చేశారు. ఇప్పుడు ‘ధురంధర్’తో కూడా అదే రిపీట్ అవ్వడంతో, నెట్‌ఫ్లిక్స్ టెక్నికల్ క్వాలిటీపై శ్రద్ధ పెట్టడం లేదని క్లియర్ గా అర్థమవుతోంది. కలర్ గ్రేడింగ్, సౌండ్ మిక్సింగ్‌లో లోపాల వల్ల సినిమా కోర్ ఎక్స్‌పీరియన్స్ దెబ్బతింటోంది.
మరో ప్రధానమైన సమస్య ‘అన్ కట్’ వెర్షన్లు. సాధారణంగా జనం ఓటీటీలో సినిమాలను చూడాలనుకునేది థియేటర్లో కట్ అయిన సీన్లను చూడటానికే. కానీ నెట్‌ఫ్లిక్స్ మాత్రం సెన్సార్ కట్స్ ఉన్న వెర్షన్లనే స్ట్రీమ్ చేస్తూ నిరాశ పరుస్తోంది. ‘ధురంధర్’ లాంటి పెద్ద సినిమాలకు కూడా అన్ రేటెడ్ వెర్షన్ ఇవ్వకపోవడంపై ఆడియన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి లోపాల వల్ల నెమ్మదిగా ప్రేక్షకులు ప్లాట్‌ఫామ్ మీద నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో అమెజాన్ ప్రైమ్, జియో సినిమా వంటి సంస్థలు క్వాలిటీ కంటెంట్ విషయంలో దూసుకుపోతున్నాయి. ఇలాంటి టైమ్ లో నెట్‌ఫ్లిక్స్ తన అప్రోచ్ మార్చుకోకపోతే కష్టమే.











