దర్శకధీరుడు రాజమౌళి పాన్ ఇండియా సినిమాల స్థాయిని ఒక్కసారిగా పెంచేయడంతో మిగతా దర్శకులు కూడా ఆ బాటలోనే వెళ్లాలని అనుకుంటున్నారు. హీరోలు కూడా దర్శకుల ఆలోచనలకు తగ్గట్టుగా ఒళ్లు వంచి పని చేస్తున్నారు. ఇక పాన్ ఇండియా మార్కెట్ కు ఏ మాత్రం తక్కువ కాకుండా నిర్మాతలు కూడా భారీగా ఖర్చు చేస్తున్నారు. డబ్బు విషయంలో ఆలోచన విషయంలో అలాగే కష్టం విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు. కానీ పాన్ ఇండియా సినిమా చేసే టప్పుడు ఆచరణలో మాత్రం చిన్న పొరపాటు చేసినా కూడా విడుదల సమయంలో అది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
ఇక పుష్ప సినిమా అందరికి ఒక గుణపాఠం అని చెప్పవచ్చు. ప్రస్తుతం సినిమా కలెక్షన్స్ అయితే బాగానే ఉన్నాయి. కానీ బ్రేక్ ఈవెన్ చేస్తుందా లేదా అనేది కాస్త కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తోంది. ఇక సినిమాలో చాలా లోపలపై అభిమానులు పెదవి విరుస్తున్నారు. సునీల్, రష్మీక క్యారెక్టర్స్ అంతగా వర్కౌట్ కాలేదు అని ఓవరాక్షన్ అన్నట్లుగా ఉందని అంటున్నారు. అంతే కాకుండా దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ పై పెట్టిన ఫోకస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో పెట్టలేదని అర్ధమవుతుంది.
మిక్సింగ్ లో కూడా చాలా లోపాలు ఉన్నాయని పలు చోట్ల VFX లోపాలను కూడా రివ్యూలలో ఎత్తి చూపారు. ఫైనల్ గా సినిమాలో అల్లు అర్జున్ తప్పితే మిగతా విషయాలు పెద్దగా హైలెట్ కాలేదు అనిపిస్తోంది. రోజు 17గంటలు శ్రమించినా కూడా చిత్ర యూనిట్ అనుకున్నంతగా ప్లాన్ తో సినిమాను తొందరగా రెడీ చేయలేదు. టాలీవుడ్ లో కూడా అనుకున్నంతగా ప్రమోట్ చేయకపోయినా కూడా ముందు నుంచి బజ్ ఉంది కాబట్టి సినిమాకు స్ట్రాంగ్ ఓపెనింగ్స్ వచ్చాయి.
ఇక మిగతా భాషల్లో కూడా బాగానే ఉన్నా చిత్ర యూనిట్ ఇంకాస్త ఎక్కువగా ప్రమోట్ చేసి ఉంటే కలెక్షన్స్ మరోలా ఉండేవని చెప్పవచ్చు. ఇక శని ఆదివారాలు కీలకం కాబట్టి ఈ రెండు రోజులు సినిమా ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.