Ravi Teja: మాస్ మహారాజ్ నిజంగానే అలా చెప్పారా?

మాస్ మహారాజ్ రవితేజకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సక్సెస్ ఫెయిల్యూర్లతో సంబంధం లేకుండా ఒక్కో సినిమాకు రవితేజ 15 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ చిరంజీవిపై ఉండే గౌరవం వల్ల రవితేజ చిరంజీవి బాబీ కాంబో మూవీలో నటిస్తున్నారు. బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీలో రవితేజ నటిస్తాడని ప్రచారం జరిగినా ఆ ప్రచారంలో నిజం లేదని ఇప్పటికే తేలిపోయింది.

Click Here To Watch NOW

అయితే రవితేజ సంచలన నిర్ణయం తీసుకున్నారని పాత్ర నచ్చితే సపోర్టింగ్ రోల్స్ లో కూడా నటిస్తానని చెప్పారని సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రవితేజ గురించి వైరల్ అవుతున్న ఈ వార్త ఆయన అభిమానులను తెగ టెన్షన్ పెడుతోంది. అయితే గాసిప్స్ గురించి రూమర్ల గురించి స్పందించడానికి రవితేజ పెద్దగా ఇష్టపడరనే సంగతి తెలిసిందే. వైరల్ అవుతున్న వార్త గురించి రవితేజ స్పందించి క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోలలో ఒకరైన రవితేజ నటిస్తున్న ధమాకా, రామారావ్ ఆన్ డ్యూటీ, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. ఈ సినిమాలతో రవితేజ సక్సెస్ ట్రాక్ లోకి వస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఖిలాడీ సినిమా ఫ్లాప్ అయినా రవితేజ మార్కెట్ పై ఆ సినిమా ఏ మాత్రం ప్రభావం చూపడం లేదు. రవితేజ యంగ్ జనరేషన్ డైరెక్టర్లలో చాలామంది డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తున్నారు.

హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా టాలెంట్ ఉన్న డైరెక్టర్లకు మాస్ మహారాజ్ అవకాశాలను ఇస్తున్నారు. యూత్ లో కూడా రవితేజకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. క్రాక్ సక్సెస్ రవితేజ కెరీర్ కు ఎంతగానో ప్లస్ అయింది. అయితే రవితేజ కెరీర్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Share.