కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఏర్పడ్డ లాక్ డౌన్ వల్ల థియేటర్స్ మూతపడిన సంగతి అందరికీ తెలిసిందే.ఎన్నో సినిమాల షూటింగ్ లకు కూడా బ్రేక్ పడింది. ప్రస్తుతం షూటింగ్ లకు కూడా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే థియేటర్స్ ఇప్పట్లో ఓపెన్ అవుతాయా? అంటే కచ్చితంగా అవునని చెప్పలేం..! అందుకే ‘వి’ చిత్రాన్ని నేరుగా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు.అయితే కొన్ని సినిమాలను మాత్రం థియేటర్ లోనే విడుదల చెయ్యాలి అని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.
ఈ లిస్టు లో రవితేజ ‘క్రాక్’ కూడా ఉంది. మాస్ మహారాజ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన ‘క్రాక్’ చిత్రం కూడా ఓటిటిలో విడుదలవుతుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ కచ్చితంగా ‘క్రాక్’ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేస్తాం అంటూ దర్శకుడు గోపీచంద్ మలినేని ఇటీవల సోషల్ మీడియాలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అందుతున్న సమాచారం ప్రకారం ‘క్రాక్’ ను 2021 సంక్రాంతి కానుకగా విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారట దర్శక నిర్మాతలు.
ఇప్పటికే నితిన్ ‘రంగ్ దే’ అలాగే అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రాలను సంక్రాంతికే విడుదల చెయ్యబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు రవితేజ కూడా ఆ రేసులో జాయినయినట్టు సమాచారం. ‘క్రాక్’ షూటింగ్ ఇంకా 15 శాతం బ్యాలెన్స్ ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరో నెల వరకూ సమయం పట్టే అవకాశం ఉంది.