బిగ్ బాస్ సీజన్ 1లో పార్టీసిపేట్ చేసినవాళ్ళందరూ ఆ టైమ్ కి వచ్చిన క్రేజ్ ను బాగానే క్యాష్ చేసుకొన్నారు. విన్నర్ శివబాలాజీ అయితే.. బిగ్ బాస్ షో అనంతరం తన ఆగిపోయిన సినిమాను కూడా రిలీజ్ చేసుకొన్నాడు. కానీ.. సెకండ్ సీజన్ లో పార్టీసీపేట్ చేసినవాళ్ళెవరికీ కూడా ఊహించిన స్థాయి స్టార్ డమ్ కాదు కనీసం గుర్తింపు కూడా లభించలేదు. నిజానికి.. ఫస్ట్ సీజన్ కంటే సెకండ్ సీజన్ గురించే ఎక్కువ డిస్కషన్స్ జరిగాయి. ఆర్మీల హడావుడి మొదలైంది కూడా ఆ సీజన్ నుంచే. అసలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు & తర్వాత బయటకి వచ్చిన ఒకవారం పాటు కౌశల్ కి ఉన్న ఫాలోయింగ్ చూసి సినిమాల్లో మనోడికి వరుస ఆఫర్లు వచ్చేస్తాయనుకొన్నారందరూ.
కట్ చేస్తే.. కౌశల్ మాత్రమే కాదు మిగతా పార్టీసిపేంట్స్ అందరూ “బిగ్ బాస్” షోకి రావడానికి ముందు ఎలా ఉన్నారో.. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఈ షో ద్వారా ఉన్న ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకొన్నవారు ఉన్నారే కానీ.. సరికొత్త పాపులారిటీ సంపాదించుకొన్నవాళ్లు లేరని చెప్పాలి. సీజన్ 2 కే ఇలా ఉంటే.. ఈ షోను ఇంకొన్ని సీజన్ల పాటు రన్ చేయడానికి తదుపరి పార్టీసీపెంట్స్ దొరుకుతారో లేదో చూడాలి.